అభిమానులకు బహిరంగ లేఖ రాసిన కన్నడ రాక్ స్టార్ యష్, ఎందుకంటే..?

Published : Jan 06, 2023, 03:06 PM ISTUpdated : Jan 06, 2023, 03:09 PM IST
అభిమానులకు బహిరంగ లేఖ రాసిన కన్నడ రాక్ స్టార్ యష్, ఎందుకంటే..?

సారాంశం

తన అభిమానుకులకు బహిరంగ లేఖ రాశారు కన్న రాక్ స్టార్ యష్. ఈసారి మిమ్మల్ని కలవడం సాధ్యం కాదంటూ ఆలేఖలో పేర్కొన్నారు. ఇంతకీ యష్ ఎందుకు లేక రాశారు.   

కెజియఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లోక్రేజ్ సాధించాడు యష్. ఇక కన్నడ నాట ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు యష్. ఇక  కన్నడ ఫ్యాన్స్ కుఆయన అంటే  ప్రాణం. ఇక దాదాపు ఏ భాషలో హీరోలు అయినా... తమ పుట్టిన రోజులను ఫ్యామిలీతోనో.. ఫారెన్ లోనో సెలబ్రేట్ చేస్తారు. కాని కన్నడ స్టార్ యష్ మాత్రం ఎప్పుడూ తన భర్త్ డేను తన ఫ్యాన్స్ మధ్యసెలబ్రేట్ చేస్తారు. 

అందుకే  ప్రతీ ఏడాది జనవరి 8న  రాకీ భాయ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తుంటారు. కాని ఈ ఏడాది మాత్రం తన ఫ్యాన్స్ న కలవలేక పోతున్నట్టు ఆయన తెలిపారు. ఆ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ..ఒక బహిరంగా లేఖ రిలీజ్ చేశాడు. అందులో ఈ రకంగా ఆయన రాశారు. ఏడాది పొడవునా నాపై అభిమానం చూపిస్తూ..  నా పుట్టినరోజు సందర్భంగా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయతలు నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపేస్తుంది. సంవత్సరమంతా మీరు చూపించే ప్రేమని.. ఎంతోకొంత మీకు తిరిగి ఇవ్వడానికి నా పుట్టినరోజున మిమ్మల్ని కలవడం జరుగుతుంది.

 

కానీ ఈ సంవత్సరం నా పుట్టినరోజున నేను సిటీలో ఉండటం లేదు. అందుకే  ఈసారి నేను మీ అందరినీ కలవలేకపోతున్నా. అన్నారు. కానీ మాట ఇస్తున్న మిమ్మల్ని తప్పకుండా త్వరలో కలుస్తాను” అంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చారు యష్. అయితే యష్ కెజియఫ్ తరువాత సైలెంట్ అయ్యారు. ఆయన తదుపరి సినిమాకోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసారితన పుట్టిన రోజున తన తదుపరి సినిమాను అనౌన్స్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే