
ఎన్ని ప్లాఫ్ లు వచ్చినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. ఆమె నేషనల్ క్రష్ రష్మిక మందన్న. వీళ్లిద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. గీత గోవిందం,డియర్ కామ్రేడ్. గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు తాము కేవలం ప్రెండ్స్ మి మాత్రమే అని వీరు చెబుతూనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఏదో ఉందని అభిమానులు మాత్రం చెబుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు కలిసి వెకేషన్ లోకి వెళ్లే ఈ జంట తాజాగా న్యూ ఇయర్ కి కూడా ఫారిన్ కి కలిసి వెళ్లి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. దీంతో వీరు కేవలం స్నేహితులు మాత్రమే కాదు అంటూ రూమర్స్ మళ్ళి జోరు అందుకున్నాయి.
తాజాగా ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రష్మిక తన ఫాన్స్ తో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతూ కనిపించింది. అందులో విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపించింది అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి గురించి ఎన్ని పుకార్లు వస్తున్నప్పటికీ ఇద్దరిలో ఒకరు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక ఈ విషయం ప్రక్కన పెడితే వీళ్లిద్దరి జంటకు అభిమానులు ఓ నిక్ నేమ్ పెట్టుకున్నారు. అదేమిటంటే...ViRash.సెలబ్రిటీల రిలేషన్‌షిప్, పెళ్లిళ్లలకు ఇలా ఇద్దరి పేర్లు కలిపి పెట్టడం కామనైపోయింది కదా. అలా విజయ్, రష్మిక జోడీని విరోష్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
ఇక సినిమాల పరంగా "పుష్ప 2" లో నటిస్తున్న రష్మిక మందన్న హిందీలో కూడా కొన్ని సినిమాలలో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ శివనిర్వణ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా "ఖుషీ" సినిమాతో బిజీగా ఉన్నారు.