జయలలిత బయోపిక్: శివగామి హైయ్యెస్ట్ పేమెంట్!

Published : Jan 17, 2019, 02:48 PM IST
జయలలిత బయోపిక్: శివగామి హైయ్యెస్ట్ పేమెంట్!

సారాంశం

  బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకున్న శివగామి రమ్యకృష్ణ ఇప్పుడు మాములు ఆర్టిస్ట్ కాదు. నార్త్ జనాలను కూడా ఆకర్షించడంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకున్న శివగామి రమ్యకృష్ణ ఇప్పుడు మాములు ఆర్టిస్ట్ కాదు. నార్త్ జనాలను కూడా ఆకర్షించడంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఓ విధంగా ఆమె హీరోయిన్ గా ఉన్నప్పటికీ కన్నా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే భారీగా ఆదాయాన్ని పెంచుకుంటోంది. 

చివరగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కనిపించిన ఈ ఎనర్జిటిక్ నటి ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో రమ్యకృష్ణ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అది వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే జయలలిత పేరుతో కొన్ని సినిమాలు మొదలయ్యాయి. ఇప్పుడు రమ్యకృష్ణ ద్వారా వెబ్ సిరీస్ రూపంలో ఆమె జీవితాన్ని చూపించనున్నారు. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి రమ్యకృష్ణ 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శివగామి కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ పేమెంట్ అని చెప్పవచ్చు. ఓ విధంగా హీరోయిన్స్ కంటే రమ్యకృష్ణ గారికే డిమాండ్ ఎక్కువగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే