KGF( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ) సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశ్ మొత్తానికి రిలీజ్ కు ముందే గ్రాండ్ హైప్ ని క్రియేట్ చేశాడు. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా కథానాయకుడు యష్ సంతృప్తిగా ఉన్నాడు. వరల్డ్ లెవెల్లో ఒక సినిమాను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి రిలీజ్ చేశామని గర్వంగా చెబుతున్నాడు.
యశ్ మాట్లాడుతూ.. "సినిమా కంటెంట్ అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించేది. అందుకే KGF సినిమాను హై బడ్జెట్ తో తీయాల్సి వచ్చింది. సినిమా స్కెల్ చాలా పెద్దది. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం అంత సాధారణమైన విషయం కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేయాలి. మా మెయిన్ ఇంటెన్షన్ వరల్డ్ వైడ్ గా సినిమా ఉండాలని అనుకున్నాం. ఇప్పుడు మేము ఆ విజయాన్ని అనుకున్నాం అని ఫీల్ అవుతున్నా.
నా పాత్ర విషయానికి.. రాకి అనే పాత్ర ఎవరి నుంచి స్ఫూర్తి పొందినది కాదు. కానీ చాలా రియాలిస్టిక్ గా అనిపిస్తుంది. చిన్నప్పుడే ఒక వ్యక్తిని డెస్టిని ఏ విధమైన అనుభవాలకు లోను చేస్తుంది. దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ బావుంటుంది. ఆ పాత్ర ప్రేరణతో పాటు ప్రతిష్టాత్మకంగా నిలిచే బలమైనది.
undefined
ఈ సినిమా కథ గోల్డ్ మైన్ మిస్టరీకి చెందింది. కథ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఇక సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. యాక్షన్ స్టైల్ - యూనిక్ స్క్రీన్ ప్లే అలాగే మంచి యాక్షన్ తో పాటు మంచి డ్రామా కూడా ఉంది. ఇక డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఇంతకుముందు కేవలం ఒక సినిమా(ఉగ్రమ్) మాత్రమే డైరెక్ట్ చేశాడు. అతని మొదటి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అతనితో వర్క్ చేయలనిపించింది. అయితే మెయిన్ గా వరల్డ్ సినిమాల్లో కన్నడ సినిమా అందరిని ఆకర్షించేలా ఒక యూనిక్ సినిమాను చేయాలని అనుకున్నప్పుడు ప్రశాంత్ నుంచి ఈ ప్రాజెక్టు మొదలైంది.
ఇక బాలీవుడ్ లో నటంచడానికి ముందు నుంచి నేను ఆసక్తిగా లేను. కానీ అక్కడ ఏ సినిమా అయినా వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కించుకుంటుంది. చాలా పెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ. అయితే ఇప్పుడు సౌత్ ఐనిమాలను కూడా బాలీవుడ్ కి మంచి పోటీని ఇస్తున్నాయి. ఎక్కడైనా సరే ఒరిజినల్ కంటెంట్ తో ఆడియేన్స్ ని మెప్పించగలిగితే వారి అభిమానాన్ని సొంతం చేసుకోవచ్చు" అని యశ్ వివరణ ఇచ్చాడు.
ఇక KGF చాప్టర్ 1 బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజయ్యింది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ 2 ని అంతకంటే ఎక్కువ బడ్జెట్ లో నిర్మించి విడుదల చెయ్యాలని యశ్ ప్లాన్ చేస్తున్నాడు.