`కేజీఎఫ్‌2` నుంచి మరో రికార్డ్‌.. టీజర్‌ వ్యూస్‌ తెలిస్తే మతిపోతుంది..

Published : Jul 16, 2021, 04:40 PM IST
`కేజీఎఫ్‌2` నుంచి మరో రికార్డ్‌..  టీజర్‌ వ్యూస్‌ తెలిస్తే మతిపోతుంది..

సారాంశం

`కేజీఎఫ్‌2` టీజర్‌ అదిరిపోయే బీజీఎంతో, గూస్‌బమ్స్ తెచ్చే డైలాగ్స్ తో రెడీ చేసిన టీజర్‌ నిజంగానే ఆడియెన్స్ లో గూస్‌బమ్స్ తీసుకొచ్చింది. టీజర్‌ రికార్డ్ వ్యూస్‌తో సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చేసింది. 

ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్‌పై తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో `కేజీఎఫ్‌` ఒకటి. మొదటిభాగానికి కొనసాగింపుగా ఇప్పుడు `కేజీఎఫ్‌ః ఛాప్టర్ 2` రూపొందింది. ఇది త్వరలోనే తెరపైకి రాబోతుంది. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. రెండ్‌ పార్ట్ కి సంబంధించిన టీజర్‌ యశ్‌ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.

అదిరిపోయే బీజీఎంతో, గూస్‌బమ్స్ తెచ్చే డైలాగ్స్ తో రెడీ చేసిన టీజర్‌ నిజంగానే ఆడియెన్స్ లో గూస్‌బమ్స్ తీసుకొచ్చింది. టీజర్‌ రికార్డ్ వ్యూస్‌తో సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చేసింది. తాజాగా ఇది మరో సంచలనం సృష్టించింది. 200 మిలియన్‌ వ్యూస్‌ని దక్కించుకుంది. విడుదలైన ఆరు నెలలోనే ఇంతటి రికార్డ్ వ్యూస్‌ని పొందడం విశేషం. సినిమా కంటెంట్‌లో ఉన్న దమ్ముని, హీరో యశ్‌ ఇమేజ్‌ని, `కేజీఎఫ్‌` క్రేజ్‌ని తెలియజేస్తుంది. 8.4 మిలియన్స్ లైక్స్ ని, 1.1 మిలియన్స్ కామెంట్స్, 1 బిలియన్‌ ఇంప్రెషన్స్ ని రాబట్టుకోవడం విశేషం. 

ఇక ఇందులో సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. అయితే విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే ఎప్పుడు విడుదలైనా కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం