తరుణ్ కుటుంబాన్ని చుట్టుముట్టిన పోలీసులు

Published : Jul 16, 2021, 02:09 PM IST
తరుణ్ కుటుంబాన్ని చుట్టుముట్టిన పోలీసులు

సారాంశం

తరుణ్ కి దైవ భక్తి చాలా ఎక్కువట. ఎక్కడకు వెళ్లినా ఉదయాన్నే పూజ చేయడం అలవాటు అట. ఓ మూవీ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన తరుణ్, తాను బస చేసిన హోటల్ గదిలో పూజలు మొదలుపెట్టారట. 

ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చాడు హీరో తరుణ్. కెరీర్ బిగినింగ్ లో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన తరుణ్, వరుస పరాజయాలతో డీలా పడ్డారు. ప్రస్తుతం తరుణ్ హీరోగా ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు. కాగా తరుణ్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి కుమారుడు. ఆయన తండ్రి చక్రపాణి కూడా నటుడే. ఈ దంపతులు ఇద్దరూ ఆలీ తో సరదాగా టాక్ షోలో పాల్గొన్నారు. 

ఈ షోలో అనేక విషయాలు పంచుకున్న రోజా రమణి, చక్రపాణి స్విట్జర్లాండ్ లో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి తెలియజేశారు. తరుణ్ కి దైవ భక్తి చాలా ఎక్కువట. ఎక్కడకు వెళ్లినా ఉదయాన్నే పూజ చేయడం అలవాటు అట. ఓ మూవీ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన తరుణ్, తాను బస చేసిన హోటల్ గదిలో పూజలు మొదలుపెట్టారట. 

భారీగా అగరొత్తులు వెలిగించడం వలన హోటల్ గది నుండి పొగలు బయటికి వచ్చాయట. అగ్నిప్రమాదం జరిగిందని భావించిన పోలీసులు పరుగున తరుణ్ హోటల్ గదిలోకి వచ్చి, చుట్టుముట్టారట. విషయం తెలుసుకొని పోలీసులు, అక్కడ నుండి వెళ్లిపోయారట. ఈ సంఘటన తమ కుటుంబాన్ని షాక్ కి గురిచేసిందని రోజా రమణి తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?