ఎలివేషన్లు, బీజీఎం.. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్న `కేజీఎఫ్‌2` టీజర్‌

Published : Jan 07, 2021, 09:45 PM ISTUpdated : Jan 07, 2021, 09:57 PM IST
ఎలివేషన్లు, బీజీఎం..  సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్న `కేజీఎఫ్‌2` టీజర్‌

సారాంశం

`కేజీఎఫ్‌` టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పాత్రల ఎలివేషన్‌ మతిపోయేలా ఉంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఏమైనా చేయగలరనే కాన్సెప్ట్ తో సాగే టీజర్‌ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `కేజీఎఫ్‌` రెండో పార్ట్ `కేజీఎఫ్‌2` టీజర్‌ విడుదలైంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఇందులో రాకీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు, తన తల్లి అతన్ని పెంచిన విధానం, ఆ తర్వాత కేజీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కన్ను, దేశంలోకి అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలి ఎంట్రీ, అనంతరం రాకీ ఎంట్రీని చూపించారు. వరుసగా పోలీస్‌ స్టేషన్‌లో జీపులను పేల్చే సన్నివేశంతో హీరో యష్‌ ఎంట్రీని చూపించారు. చివరగా భగ భగ మండే గన్‌ నుంచి సిగరేట్‌ కాల్చుకునే సీన్‌ హైలైట్ గా నిలిచింది. 

`కేజీఎఫ్‌` టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పాత్రల ఎలివేషన్‌ మతిపోయేలా ఉంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఏమైనా చేయగలరనే కాన్సెప్ట్ తో సాగే టీజర్‌ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. మొదటి సినిమాని మించి ఈ రెండో భాగం ఉంటుందనేది టీజర్‌ చెప్పకనే చెబుతుంది. ఇందులో యష్‌ పాత్ర తీరుతెన్నులు మరింత హీరోయిజం మేళవింపుగా ఉందని తెలుస్తుంది. ఇక దేశ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో రవీనా టండన్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. ఆమె పాత్రని వర్ణించి తీరు మెస్మరైజ్‌ చేస్తుంది.అయితే టీజర్‌ మొత్తం ఎలివేషన్లు, బీజీఎంతోనే సాగింది. వాటిపైనే ఫోకస్‌ పెట్టినట్టు కనిపిస్తుంది. 

రేపు(శుక్రవారం) యష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని రేపు ఉదయం విడుదల చేస్తామని ముందే చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఉన్నట్టుండి గురువారం రాత్రినే 9.30 నిమిషాలకు టీజర్‌ విడుదల చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ముందుగానే టీజర్‌ లీక్‌ కావడంతో గత్యంతరం లేక అధికారికంగా విడుదల చేసినట్టు సమాచారం. ఇందులో మెయిన్‌ విలన్‌ అయిన సంజయ్‌ దత్‌ పాత్రని చూపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?