ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్‌ రెడీ చేసిన పవన్‌ కళ్యాణ్‌.. `వకీల్‌సాబ్‌` టీజర్‌ డేట్‌ ఫిక్స్ !

Published : Jan 07, 2021, 07:12 PM IST
ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్‌ రెడీ చేసిన పవన్‌ కళ్యాణ్‌.. `వకీల్‌సాబ్‌` టీజర్‌ డేట్‌ ఫిక్స్ !

సారాంశం

తన అభిమానులకు సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` నుంచి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` నుంచి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి రోజున సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిపారు.  

ఇందులో పవన్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవన్‌ కళ్యాణ్‌ పార్ట్ పూర్తయ్యింది. ఇటీవల న్యూ ఇయర్‌ సందర్భంగా బైక్‌పై పవన్‌, శృతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ డ్యూయెట్‌ పాడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుని అభిమానులను అలరించారు. ఇక సంక్రాంతికి పెద్ద ట్రీట్ నే రెడీ
చేస్తున్నారు. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?
ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్