చూడముచ్చటైన దృశ్యం.. ఒకే ఫ్రేములో ఇద్దరు సూపర్‌ స్టార్స్

Published : Jan 07, 2021, 08:59 PM IST
చూడముచ్చటైన దృశ్యం.. ఒకే ఫ్రేములో ఇద్దరు సూపర్‌ స్టార్స్

సారాంశం

మమ్ముట్టి, మోహన్‌లాల్‌ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటివారు. రెండు పిల్లర్లు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇద్దరు సూపర్‌ స్టార్లు మంచి స్నేహితులు. సినిమాలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

కంప్లీట్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌, సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఒకే ఫ్రేములో కనిపిస్తే కనువిందుగా ఉంటుంది. ఇది వారి అభిమానులకే కాదు, సినీ ప్రియులకు కూడా చూడముచ్చటగానూ ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని తాజాగా మోహన్‌లాల్‌ అభిమానులతో పంచుకున్నారు. అనేక వార్తలను క్రియేట్‌ చేశారు. 

మమ్ముట్టి, మోహన్‌లాల్‌ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటివారు. రెండు పిల్లర్లు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇద్దరు సూపర్‌ స్టార్లు మంచి స్నేహితులు. సినిమాలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లోనూ నటించారు. తాజాగా ఊహించని విధంగా వీరు ఒకే ఫ్రేములో కనిపించడం అభిమానులను సంబరానికి గురి చేస్తుంది. ఫ్యాన్స్ కిది కనువిందునిస్తుంది. అయితే ఇద్దరి కలయికలోని ఆంతర్యం ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారా? లేక స్నేహపూర్వకంగా కలిశారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం మోహన్‌లాల్‌ `దృశ్యం2`, `రామ్‌`, `ఆరాట్టు` చిత్రాల్లో నటిస్తుంది. `మరక్కర్‌ః అరేబియన్‌సింహం` విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మమ్ముట్టి `ది ప్రీస్ట్`, `వన్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాదాపు అటు ఇటు ఒకే టైమ్‌లో వీరిద్దరు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?