కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్-2 పైనే అందరి దృష్టీ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుతోంది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెలే -కేజీఎఫ్ చాప్టర్ 2. పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం సీక్వెల్ ఈ సంవత్సరం తెరపైకి రావటానికి రంగం రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని మే 30న అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయటానికి నిర్మాతలు డేట్ ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. ఈ రిలీజ్ డేట్ విషయాన్ని నిర్మాతలు...తమ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే పంపిణీదారులకు తెలియచేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ విషయం అర్దం చేసుకున్న కేజీఎఫ్ చాప్టర్-2 నిర్మాతలు తెలుగు రైట్స్ భారీగా అమ్మారు. ఇప్పుడు ఏరియావైజ్ బిజినెస్ జరుగుతోంది. ట్రేడ్ లో చెప్పుకునేదాన్ని బట్టి కొర్రపాటి సాయి తెలుగు రైట్స్ బిజినెస్ చూస్తున్నారు. ఈ నేపధ్యంలో నైజాం ఏరియా రైట్స్ కు భారీ బెట్టింగ్ జరుగుతోంది.
అక్కడ పెద్ద పంపిణీదారుడు అయిన దిల్ రాజు సీన్ లోకి వచ్చారు. అయితే ఆ ఏరియాకు చెప్పిన రేటు విని ఆయన షాక్ అయ్యినట్లు తెలుస్తోంది. కరోనా నేపధ్యంలో ఆ స్దాయి రేట్లను ఆయన ఎక్సపెక్ట్ చేయలేదట. దాంతో కొందామా వద్దా అనే డైలమోలో ఉన్నారట. ప్రస్తుతం ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఓ కండీషన్ పెట్టారట. వాళ్లు చెప్పిన రేటుకు తాను తీసుకుంటానని, అయితే రేపు అనుకున్న స్దాయిలో సినిమా ఆడకపోతే నష్టం రికవరి చేయాలని ఎగ్రిమెంట్ చేయాలని అడిగారట. కానీ దానికి మాత్రం కేజీఎఫ్ నిర్మాతలు ఒప్పుకోవటం లేదట.
అయితే తాము కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ చాప్టర్-2కు ఏడు రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టి తీసామని , ఆ మాత్రం రేటు తీసుకోకపోతే మునిగిపోతామని చెప్పారట. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల నుంచి 60 కోట్లు బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నారట. చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నట్లు తెలుస్తోంది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందు, వెనక ఆలోచిస్తున్నారు. ఇక హిందీ రైట్స్ ని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారట.
కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్ చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్, ఆనంత్‌నాగ్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్ కోసం వేచి చూద్దాం.