
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నాలుగున్నర కోట్లు సాలిడ్ బిజినెస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో కోటిన్నరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు ఆంధ్రలో 2.1 కోట్లు.. సీడెడ్ హక్కులు 55 లక్షలకు అమ్ముడయ్యాయి. ఏపీ తెలంగాణలో ఈ సినిమా 4.3 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి మరో 30 లక్షల బిజినెస్ చేసింది.
నిర్మాతలు రిలీజ్ కు ముందే మంచి లాభాల్లో పడినట్లు అయ్యింది. అంటే ఈ సినిమా ఐదు కోట్లు మినిమం వసూలు చేస్తే సేఫ్ ప్రాజెక్టు అవుతుంది. ఈ టార్గెట్ ఇలాంటి చిన్న సినిమాలకు చాలా పెద్దది. కానీ చేసిన బిజినెస్ ని బట్టి తప్పదు. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మలేదని, అవి కూడా మంచి రేటు వస్తాయని భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరికటం కలిసొచ్చే విషయం. ఫిబ్రవరి 5న జాంబీ రెడ్డి వచ్చేవరకూ ఈ సినిమాకు పెద్దగా పోటీ లేదు. క్రాక్, మాస్టర్ వంటి సినిమాలు కూడా ఓటిటిలో వచ్చేస్తుండడంతో ప్రదీప్ సినిమాకు మంచి అవకాశం దొరికుతుంది. ఏ మాత్రం సినిమా బాగున్నా లాగేస్తుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాది పూర్తయింది. మార్చ్ లోనే ఫస్ట్ కాపీ సిద్ధమైంది. అయితే కరోనా కారణంగా సినిమా విడుదలను ఆపివేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఇది ఒక పీరియాడిక్ ప్రేమకథగా తెలుస్తోంది. గత జన్మల నేపథ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి.
‘ఆర్య 2’, , నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులోని నీలి నీలి ఆకాశం.. సాంగ్ ఎంతోమంది ప్రేక్షకుల మనస్సుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి.