గూని బాబ్జిగా రావు రమేష్... మహాసముద్రం విలన్ ఈయనేనా?

Published : May 25, 2021, 05:11 PM IST
గూని బాబ్జిగా రావు రమేష్... మహాసముద్రం విలన్ ఈయనేనా?

సారాంశం

నేడు వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ బర్త్ డే పురస్కరించుకొని మహాసముద్రం మూవీలోని ఆయన లుక్ విడుదల చేశారు. రావు రమేష్ లుక్ చాలా భిన్నంగా ఉంది. గూని లోపం కలిగిన వ్యక్తిగా ఆయనను పరిచయం చేశారు. 

దర్శకుడు అజయ్ భూపతి మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100తో సంచలన విజయం అందుకున్నారు. 2018లో ఆర్ ఎక్స్ 100 విడుదల కాగా చాలా గ్యాప్ తరువాత మహాసముద్రం మూవీ చేస్తున్నాడు ఆయన. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. వైజాగ్ నేపథ్యంలో సాగే మహా సముద్రం చిత్రంలోని పాత్రలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. 


నేడు వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ బర్త్ డే పురస్కరించుకొని మహాసముద్రం మూవీలోని ఆయన లుక్ విడుదల చేశారు. రావు రమేష్ లుక్ చాలా భిన్నంగా ఉంది. గూని లోపం కలిగిన వ్యక్తిగా ఆయనను పరిచయం చేశారు. గూని బాబ్జి రావు రమేష్ క్యారెక్టర్ పేరు కాగా, విలన్ లా కనిపిస్తున్నారు. మహాసముద్రం మూవీ కోసం బలమైన పాత్రలు దర్శకుడు రాసుకున్నాడని అర్థం అవుతుంది. 

అదితి రావ్ హైదరి, అను ఇమ్మానియేల్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. కాగా పాన్ ఇండియా చిత్రం కెజిఎఫ్ లో కూడా రావు రమేష్ కీలక రోల్ చేస్తున్నారు. కెజిఎఫ్ నుండి ఆయన లుక్ నేడు విడుదల చేశారు. కన్నెగంటి రాఘవన్ అనే సీబీఐ అధికారి పాత్ర చేస్తున్నట్లు కెజిఎఫ్ టీమ్ రివీల్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?