నేను ఆరోగ్యంగానే ఉన్నా... ఆ వార్తలలో నిజం లేదు: చంద్రమోహన్

Published : May 25, 2021, 04:25 PM IST
నేను ఆరోగ్యంగానే ఉన్నా... ఆ వార్తలలో నిజం లేదు: చంద్రమోహన్

సారాంశం

టాలీవుడ్ కి చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆరోగ్యం సరిగా లేదని వరుస కథనాలు రావడం జరిగింది. దీనితో ఆయన వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు.

మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, సినిమాలు కూడా చేయకుండా ఉంటున్న సీనియర్ నటుల ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రావడం సర్వసాధారణం అయిపోయింది.  ఇటీవల నటుడు పరేష్ రావల్ ఏకంగా చనిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనితో ఆయన మీడియా వేదికగా నేను బ్రతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా టాలీవుడ్ కి చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్ పై ఈ తరహా వార్తలే రావడం జరిగింది దీనితో ఆయన వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. 


తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో ఒకరిగా చంద్రమోహన్ పేరుగాంచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సమయంలో యువకుడిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఆయన హీరోగా ఎన్నో విజయాలను అందుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. అయితే, చంద్రమోహన్ ఆరోగ్యం బాగోలేదని ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన స్వయంగా స్పందిస్తూ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.


తన ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారమవుతోందని చంద్రమోహన్ చెప్పారు. తనకు బాగోలేదని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అందరి అభిమానాలే తనకు శ్రీరామ రక్ష అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు