‘సలార్’ నెక్ట్స్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు.. ఇక్కడితో ఆ పార్ట్ పూర్తి కానుంది.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

Published : Jul 18, 2022, 10:09 AM IST
‘సలార్’ నెక్ట్స్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు.. ఇక్కడితో ఆ పార్ట్ పూర్తి కానుంది.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

సారాంశం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.    

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ మూవీ ‘సలార్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం ఎక్కడా డిలే లేకుండా కొనసాగుతోంది.  ఇప్పటికే  పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ప్రశాంత్ నీల్ 35 శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ అప్డేట్ తర్వాత మరిన్ని షెడ్యూళ్లను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. త్వరలో మరో ఇంపార్టెంట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ సెట్స్ లో ఉన్నారు. తర్వలోనే Salaar తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ కొన్ని వినిపిస్తున్నాయి. సలార్ నెక్ట్స్ షెడ్యూల్ తో ప్రభాస్ షూటింగ్ పార్ట్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. అలాగే టాకీ పార్ట్ కూడా ఈ షెడ్యూల్ లోనే పూర్తయ్యేట్టు  ప్లాన్ చేశారంట. అంతేకాకుండా ఓ భారీ లోయలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారంట. ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే సన్నవేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.  

కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత ప్రభాస్ - ప్రశాంత్ నీల్  కాంబినేషన్ లో సినిమా ఒకే చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారంతో మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అభిమానులు ఈ యాక్షన్ వండర్స్ ను ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు ప్రభాస్ కూడా ఎక్కడా డిలే కాకుండా ఇటు సలార్.. అటు Project K షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.
 
చిత్రంలో ప్రభాస్ కు జోడీగా హీరోయిన్ శ్రుతిహాసన్‌ (Shruthi Haasan) ఆడిపాడనుంది. మలయాళం యాక్టర్  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రద్ద కపూర్‌తోనూ ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నట్టు టాక్. ఓ కీలక సన్నివేశంలో యష్ కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దీంతో సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.  హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ రూ.200 కోట్లతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..