NTR30: ఎన్టీఆర్, కొరటాల చిత్రానికి మరో రచయిత సాయం.. ఆ ఇబ్బందుల వల్లే..

Published : Jul 18, 2022, 08:41 AM IST
NTR30: ఎన్టీఆర్, కొరటాల చిత్రానికి మరో రచయిత సాయం.. ఆ ఇబ్బందుల వల్లే..

సారాంశం

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడిన యంగ్ టైగర్.. ఆ చిత్రం పూర్తి కావడంతో విశ్రాంతి కోసం చిన్నవిరామం తీసుకున్నారు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కాబోతోంది. 

ఇప్పటికే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఆచార్య చిత్ర పరాజయ భారం కొరటాల మెడకు చుట్టుకుంది. నష్టాలు భర్తీ చేయాల్సిందిగా బయ్యర్లు గొడవ చేస్తున్నారు. ఈ సమస్యలతో కొరటాల ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ పై ఫోకస్ చేయలేకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ వర్క్ త్వరగా పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ కొరటాలకి ఓ సలహా ఇచ్చాడట. ఓ ప్రముఖ రచయిత పేరు ప్రస్తావించాడట. స్క్రిప్ట్ విషయంలో ఆయన సాయం తీసుకోవాల్సిందిగా కొరటాలకి ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆ రచయిత ఎన్టీఆర్ 30 టీం లో జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. బయట దీనిపై స్ట్రాంగ్ బజ్ నెలకొంది. 

కొరటాల శివ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కంప్లీట్ మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ ని క్లాస్ అండ్ మాస్ గా చూపించారు. కానీ ఎన్టీఆర్ 30లో ఎక్కువగా యాక్షన్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..