రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నటుడు!

Published : Sep 02, 2019, 02:33 PM IST
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నటుడు!

సారాంశం

ఇటీవల సినీ తారలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, కమెడియన్ అయిన కెవిన్ హార్ట్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రోజు మల్హోల్యాండ్ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. 

కెవిన్ అతడి స్నేహితులు కలసి ఈ కారులో ప్రయాణిస్తున్నారట. రహదారిపై వేగంగా ప్రయాణించడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెన్సింగ్ ని ఢీకొట్టింది. దీనితో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం పైభాగం మొత్తం ధ్వంసం అయింది. 

కెవిన్ స్నేహితుడు కారుని డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం. కెవిన్ తో పాటు, అతడి స్నేహితుడికి నడుము భాగంలో తీవ్రమైన గాయం అయింది. కెవిన్ స్నేహితుడిని పెట్రోలింగ్పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. 

కెవిన్ ని అతడి వ్యక్తిగత సిబ్బంది మరో కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కెవిన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేదానిపై సమాచారం లేదు. కెవిన్ సినిమాల్లోనూ, బుల్లితెరపై ప్రముఖ నటుడిగా రాణిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..