రికార్డ్ ధరకు 'సైరా' హక్కులు.. బాహుబలి, సాహోలను మించి!

Published : Sep 02, 2019, 01:54 PM IST
రికార్డ్ ధరకు 'సైరా' హక్కులు.. బాహుబలి, సాహోలను మించి!

సారాంశం

'సైరా' సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.   

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో  జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మెగాఫ్యామిలీకి క్రేజ్ ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సినిమా హక్కులను రూ.19..6 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఆ జిల్లాల్లో 'బాహుబలి 2', 'సాహో' సినిమా హక్కులు కూడా ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోలేదని.. 'సైరా' రికార్డు సృష్టించిందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో నిర్మాతలు వెల్లడించాల్సివుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: విజయ్ దేవరకొండపై రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్.. అలా అనేసిందేంటి?
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..