తెలుగు సినీపరిశ్రమ సమస్యలు పరిష్కరించాలి-ఇద్దరు సీఎంలకు కేతిరెడ్డి లేఖ

First Published Mar 5, 2018, 5:21 PM IST
Highlights
  • తెలుగు పరిశ్రమలో సమస్యలు పరిష్కరించాలన్న కేతిరెడ్డి
  •  పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన కేతిరెడ్డి
  • డిజిటల్ ప్రొవైైడర్ల అక్రమ వసూళ్లు అడ్డుకుని, సినిమాలు నడపాలన్న కేతిరెడ్డి

చిత్రపరిశ్రమ సమస్యల పై ముఖ్యమంత్రులు స్పందించి,పరిష్కారం కొరకు ఒక కమిటీ ని నియమించాలని నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి ,అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక లేఖ లో తెలంగాణ సి.ఎం.కేసీఆర్ గారిని, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొరినట్లు ఆయన ఒక ప్రకటన లో తెలిపారు . డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, నిర్మాతల మధ్య జరుగుతున్న వివాదం ,ప్రస్తుతం సినిమా పరిశ్రమ థియేటర్ లను బంద్ చేయటం ..రాష్ట్రం లోని సినిమా లను ప్రేమించే ప్రేయక్షకుల కు ఇబ్బందికరం గా మారిందని ,కుటుంబ సభ్యులందరికి కేవలం సినిమా అనే  వినోదం తప్పితే వేరే వినోదం లేదని....చిన్న సినిమాను బ్రతికించుటకు ప్రస్తుతం ఉన్న 4 ఆటల తో పాటు 5 వ ప్రదర్శన గా కచ్చితంగా చిన్న సినిమాను ప్రదర్శించేవిధంగా.. ఆ ప్రదర్శన కు టాక్స్ లేకుండా ఉండే విధంగా ఒక జి. ఓ.ను తీసుకొచ్చి చిన్న సినిమాను ,చిన్న నిర్మాతలను బ్రతికించాలని కోరారు.

 

డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్  వారికిచ్చే కంటెంట్ ద్వారా ప్రకటన లను అందులో చేర్చి కోట్లు.. కోట్లు సంపాదిస్తున్నపుడు.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రదర్శన కొరకు అధిక రుసుం వసూలు చేయటమేంటని పేర్కొన్నారు. అసలు తగ్గించేది అటు ఉంచండి , అసలు నిర్మాతలు ఇచ్చే కంటెంట్ తో ప్రకటన ల రూపంలో కోట్లు దండుకొంటున్నారు కాబట్టి మా కంటెంట్ ప్రదర్శన కు డబ్బులే తీసుకోకుండా చర్యలు చేపట్టాలి. ఒకప్పుడు యూ.ఎఫ్.ఓ.అని క్యూబ్ అని రెండు సంస్థ లు వేర్వేరు సంస్థలని, ఇప్పుడు రెండు సంస్థలు కలిసి నిర్మాత లను దోపిడీ చేస్తున్నారని.. .రాష్ట్రప్రభుత్వం వారిని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని .అవసరమైతే ప్రభుత్వమే థియేటర్లకు వారి పొజెక్టర్లు స్థానంలో ప్రొజెక్టర్లను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ల ద్వారా చేయుటకు చేయూత నివ్వాలని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొంటే 15 రూపాయలు అధికంగా తీసుకొంటున్నారు..ప్రభుత్వమై ఒక పోర్టల్ ను ప్రారంభించి ప్రేక్షకులపై ఆదనపు భారం పడకుండా చూడాలి ,ఇప్పటికే సినిమా చూడాలంటే ప్రేక్షకుడు నిలువుదోపిడికి గురవుతున్నాడని, తినుబండారాలు తదితర విషయాలలో దోపిడీ జరుగుతోంది కాబట్టి.. ఇది వ్యాపారం అనే కంటే ప్రజా సమస్య అని కూడా ఆలోచించి ప్రభుత్వం ఈ మాఫియా పై ఉక్కు పాదం మోపి... సినిమా చూడాలనుకునే సగటు ప్రేక్షకులను, పరిశ్రమను కాపాడుటకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని వెంటనే సినిమా, మరియు ప్రేక్షకుల దోపిడీకి చరమ గీతం పాడాలని కేతిరెడ్డి లేఖలో కోరారు.

click me!