Keerthy Suresh covid 19: కీర్తి సురేష్‌కి కరోనా.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Published : Jan 11, 2022, 05:40 PM ISTUpdated : Jan 11, 2022, 05:55 PM IST
Keerthy Suresh covid 19: కీర్తి సురేష్‌కి కరోనా.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

సారాంశం

 స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఓ నోట్‌ని పంచుకుంది.

కరోనా వైరస్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్నారు. వరుసగా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఓ నోట్‌ని పంచుకుంది. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అన్ని రకాలు జాగ్రత్తలు పాటిస్తున్నానని తెలిపింది. వైరస్‌ విస్తరిస్తున్న తీరుపై ఆమె హెచ్చరించింది. ఇది భయంకరమైనదనేది గుర్తించాలని తెలిపింది. 

కరోనాకి సంబంధించి జాగ్రత్తలు కచ్చితంగా ఫాలో కావాలని, సేఫ్‌గా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానని, అని రకాల కేరింగ్‌లో ఉన్నానని తెలిపింది. ఇటీవల తనని కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది కీర్తిసురేష్‌. ఇప్పటికీ వ్యాక్సినేషన్‌ చేయించుకోకపోతే వెంటనే తీసుకోవాలని సూచించింది. అభిమానులు ఆందోళన చెందొద్దని తెలిపిన కీర్తి మీ ప్రేమకి ధన్యవాదాలని పేర్కొంది.  ఇదిలా ఉంటే తమ అభిమాన కథానాయికకి కరోనా అని తేలడంతో త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. 

కీర్తిసురేష్‌.. ఇటీవల రజనీకాంత్‌తో `అన్నాత్తే` చిత్రంలో నటించి అలరిచింది. చెల్లిగా మెప్పించిన ఆమె మరోసారి సిస్టర్ రోల్‌ చేస్తుంది. తెలుగులో మెగాస్టార్‌ పక్కన చెల్లి పాత్ర పోషిస్తుంది. `భోళాశంకర్‌`లో ఆమె చిరుకి సిస్టర్‌ రోల్‌ చేస్తుండటం విశేషం. మరోవైపు ఆమె మహేష్‌బాబుతో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఇటీవల దుబాయ్‌ వెళ్లి వచ్చిన మహేష్‌కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు కీర్తికి కరోనా సోకడంతో ఈ సినిమా ప్రారంభమవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుందని చెప్పొచ్చు. 

మరోవైపు కీర్తిసురేష్‌ `సాని కాయిధమ్‌`, `వాషి`, `దసరా` చిత్రాల్లో నటిస్తుంది. `దసరా`లోని నాని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు కీలక పాత్రలతోపాటు హీరోయిన్‌గానూ చేస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది కీర్తి సురేష్‌. మరోవైపు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్‌బాబుతోపాటు థమన్‌, రాజేంద్రప్రసాద్, మంచు మనోజ్‌, శోభన, ఇషా చావ్లా, విష్ణు విశాల్‌, ఖుష్బు, త్రిష, సత్యరాజ్‌, మీనా వంటి వారు కరోనాకి గురయ్యారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి