Ram Gopal Varma: జగన్‌ ప్రభుత్వానికి వర్మ నాలుగు బెస్ట్ సలహాలు.. వింటే షాకవ్వాల్సిందే..

Published : Jan 11, 2022, 04:48 PM IST
Ram Gopal Varma: జగన్‌ ప్రభుత్వానికి వర్మ నాలుగు బెస్ట్ సలహాలు.. వింటే షాకవ్వాల్సిందే..

సారాంశం

వర్మ  నాలుగు అమూల్యమైన సలహాలిచ్చారు. ఇలాంటి టికెట్ల రేట్లు ఉంటే సినిమా, థియేటర్‌ అనేది పరిణామం చెందాలని, మళ్లీ పాత రోజులకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. 

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి రామ్‌గోపాల్‌ వర్మ వరుస ట్వీట్లతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. తాను ఓ విషయంపై దృష్టి పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం పదుల ట్వీట్లతో ఏపీ ప్రభుత్వానికి ముంచెమటలు పట్టించిన రామ్‌గోపాల్‌ వర్మ.. అదే సమయంలో కొన్ని సలహాలిచ్చారు. బలవంతంగా తక్కువ టికెట్ల రేట్లని అవలంభిస్తే థియేటర్లు మూసుకోవాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. దీని వల్ల బ్లాక్‌ టికెటింగ్‌ పెరుగుతుందని, ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుందన్నారు. 

దీంతోపాటు వర్మ  నాలుగు అమూల్యమైన సలహాలిచ్చారు. ఇలాంటి టికెట్ల రేట్లు ఉంటే సినిమా, థియేటర్‌ అనేది పరిణామం చెందాలని, మళ్లీ పాత రోజులకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. ఊరూర తిరిగి సినిమాలు ప్రదర్శించాలని వెల్లడించారు. థియేటర్‌ వ్యవస్థ పోయి ఇక మినీ థియేటర్లని తీసుకురావాలని, సినిమా చూసేలా జనాన్ని ప్రోత్సహించాలని, ఆడియెన్స్ సంఖ్యని పెంచాలని వెల్లడించారు. చైనా, అమెరికాలో థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అలా మన వద్ద కూడా థియేటర్ల సంఖ్యని, మినీ థియేటర్లని పెంచాలన్నారు. 

అదే సమయంలో ప్రభుత్వానికి కొన్ని చురకలంటించారు. టికెట్ల రేట్లు ప్రజలకు ఇబ్బందిగా మారితే, నిత్యావసర వస్తువుల ధరని భరించలేని వ్యక్తుల గురించి ప్రభుత్వానికి నిజంగా శ్రద్ధ ఉంటే, తక్కువ ధర టికెట్లని కొంత సంక్షేమ పథకాలుగా,పాక్షికంగా ప్రభుత్వ ఛారిటీగా అందించవచ్చు` అని సెటైర్లు వేశారు వర్మ. ఇక సినిమాని ప్రోత్సాహించాలనుకుంటే, సినిమాని చూసే వ్యక్తుల సంఖ్యని పెంచడం, తక్కువ టికెట్‌ ధరలతో ఇంటీరియరల్‌కు చేరుకోవడం వంటి వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన నాలుగు సలహాలిచ్చారు వర్మ. 

అందులో ఒకటి.. పిక్చర్‌ టైమ్ టెక్నాలజీ ప్రకారం.. దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగే చిన్న ట్రక్కు ఉంటుంది. కేవలం కొన్ని గంటల్లోనే వారు అన్ని భద్రతా నిబంధనలను చెక్కుచెదరకుండా గాలితో కూడిన థియేటర్‌ని నిర్మించారు. ఇప్పటికే ఇది ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ పద్ధతిని ఫాలో కావాలన్నారు. రెండు.. కారవాన్‌ టాకీస్‌. మూవీ ఆన్‌ వీల్స్ కాన్సెప్ట్ ప్రకారం భారతదేశంలోని అంతర్గత ప్రాంతాలలో ఉన్న గ్రామీణజనాభా కోసం గ్రామాలలో సినిమాని ప్రదర్శించడం. 

మూడు.. నోవా సినిమా.. ఇటుక మోర్టార్‌కి బదులుగా, ప్రీ ఫ్యాబ్రికేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి సినిమా థియేటర్లని ఏర్పాటు చేయడం. ఖాళీ ప్లాట్‌లను అద్దెకు తీసుకుని, తక్కువ ఖర్చుతో థియేటర్ నిర్మించి సినిమాలు ప్రదర్శించడం. నాల్గవది.. పెద్ద గదులు, గ్యారేజీలు, నిరూపయోగంగా ఉన్న గోడౌన్లని, ఖాళీ స్థాలను మినీ థియేటర్లుగా మర్చాడానికి ప్రజలను ప్రోత్సహించడం అంటూ సెటైరికల్‌గానే ఏపీ ప్రభుత్వానికి సలహాలిచ్చారు వర్మ. ఓ రకంగా థియేటర్‌, మల్టీఫ్లెక్స్ అనే సిస్టమే లేకుండా చేయడమన్నమాట. ఇంటిదగ్గరికే సినిమా అనేలా ఉంది వర్మ ఇచ్చిన సలహా. 

ఇక చివరగా వర్మ చెబుతూ, ప్రభుత్వం షోల ధర, షోల సంఖ్య, షోల టైమ్‌ని చిత్ర పరిశ్రమకి వదిలేసి, దాని శక్తి, వనరులు రెండింటినీ భద్రతా నిబంధనలు, లావాదేవీలపై పారదర్శకత అమలు చేయడంపై మాత్రమే కేంద్రీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినానికి మరో రిక్వెస్ట్ చేశారు వర్మ. వైసీపీ నాయకులు, సినిమా వాళ్లు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కంటే, ఒకరితో ఒకరు కూర్చొని ఆరోగ్యకరమైన చర్చలు జరుపుకోవాలన్నారు. ఈ విషయంలో మీడియా సంస్థలు కూడా ఆత్మ శోధన చర్చని ప్రేరేపించేలా వ్యవహరించాలని, అందరికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. మరి దీనిపై మంత్రి పేర్ని నాని, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..