Keerthy Suresh Troll: స్టేజ్ మీద కీర్తి సురేష్ కాలు పట్టుకున్న నిర్మాత.. ట్రోల్ చేసిన వారికి దిమ్మతిరిగే కౌంటర్!

Published : Nov 19, 2026, 05:50 PM IST
Keerthy Suresh troll

సారాంశం

సత్యవాన్ సావిత్రి సినిమా ప్రమోషన్స్ టైంలో ఓ నిర్మాత కీర్తి సురేష్‌ను తాకిన వీడియో వైరల్‌గా మారింది. దీనివల్ల ఆమె ఇబ్బంది పడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దానికి ఈ స్టార్ హీరోయిన్ గట్టిగానే సమాధానం చెప్పింది.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సత్యవాన్ సావిత్రి సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ గ్యాప్‌లో ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పబ్లిక్ ప్లేస్‌లలో పర్సనల్ బౌండరీస్, కన్సెంట్ గురించి ఈ వీడియో పెద్ద చర్చే రేపుతోంది.

అసలేం జరిగింది?

సత్యవాన్ సావిత్రి సినిమా రిలీజ్ ఉన్నందున కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా ఉన్న ఆమె.. రీసెంట్‌గా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆ టైంలో ఓ నిర్మాత ఆమె కాలు మీద చేయి వేసి మాట్లాడుతున్న వీడియో బయటకొచ్చింది. ఇది చూసి కీర్తి సురేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే ఈ వివాదానికి ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు.

నవంబర్ 18న చెన్నైలో ఈ ప్రెస్‌మీట్ జరిగింది. సినిమా నిర్మాత మిస్కిన్ మాట్లాడుతున్నప్పుడు కీర్తి సురేష్‌ను ప్రశంసించారు. అలా మాట్లాడుతున్న ఫ్లోలో ఆయన ఆమెను టచ్ చేశారు. ఒకట్రెండు సార్లు ఆయన చేయి ఆమె వైపు వచ్చినప్పుడు కీర్తి సురేష్ నార్మల్‌గానే ఉన్నారు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కీర్తి సురేష్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారంటూ కామెంట్లు, పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

వీడియో వైరల్ అవ్వగానే కీర్తి రిప్లై

ఈ వీడియో వైరల్ అవ్వగానే స్వయంగా ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. మొదటి విషయం, నా ఫేస్‌లో మీకు ఎక్కడ డిస్‌కంఫర్ట్ కనిపించింది? మేం తండ్రీకూతుళ్ల లాంటి బంధాన్ని పంచుకుంటున్నామని ఆయన చెప్పారు, నేనూ చెప్పాను. అది మీకు వినిపించలేదా? రెండో విషయం, ఒకవేళ నేను డిస్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాననే అనుకోండి.. సినిమాల్లో టచ్ చేస్తారు కాబట్టి పబ్లిక్‌లో కూడా అలానే చేయాలని మీరు అంటున్నారా? బ్రదర్, ముందు మీరు కొన్ని విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చి వివాదానికి చెక్ పెట్టిన వెంటనే.. ఆమెను ప్రశ్నించిన ఆ వ్యక్తి తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌ను డిలీట్ చేశారు. అన్నట్టు సత్యవాన్ సావిత్రి సినిమా రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన 'ఓం చాప్టర్ 1' (OM Chapter 1) చిత్రంతో పోటీ పడనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Highest Grossing Movies 2026: ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు.. రామాయణ నుంచి 'ధురంధర్ 2' వరకు భారీ వసూళ్లు!
విజయశాంతికి పాట పాడితే రెండు రోజులు రెస్ట్ తీసుకోవల్సిందే.. స్టార్ సింగర్ చిత్ర సంచలన కామెంట్స్..