Dulquer Salmaan: సినిమాల్లోకి రాకముందు దుల్కర్ ఏం చేసేవారో తెలుసా.. మెగాస్టార్ కొడుకు అయినా కూడా ఆ భయం

Published : Nov 18, 2026, 08:02 PM IST
Dulquer Salmaan

సారాంశం

మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లోని ఒక నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేశాడు. కానీ అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది.

మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్గజం మమ్ముట్టి కుమారుడైనప్పటికీ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. వైవిధ్యమైన నటన, విభిన్నమైన కథల ఎంపికతో బహుభాషా నటుడిగా ఎదిగాడు. ప్రస్తుతం దుల్కర్ నటించిన మోస్ట్ అవేటెడ్ తెలుగు సినిమా 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు తన రాబోయే తమిళ చిత్రం 'గోలి'లో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఈ సంబరాల మధ్యలో, సినిమాల్లోకి రాకముందు దుల్కర్ సల్మాన్ దుబాయ్‌లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేసేవాడనే విషయం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది.

దుబాయ్ లో ఉద్యోగం

2022లో 'కర్లీ టేల్స్' ఛానెల్‌కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభ రోజుల గురించి దుల్కర్ సల్మాన్ ఓపెన్ అయ్యాడు. తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ, మొదట్లో కెమెరాను ఫేస్ చేయాలంటే తనకు భయం, సంకోచం ఉండేవని చెప్పాడు. ఈ కారణంగానే అతను సినిమా రంగానికి బదులు వేరే కెరీర్‌ను ఎంచుకుని దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగంలో చేరిన దుల్కర్, కార్పొరేట్ స్టైల్లో కెరీర్ సాగించేవాడు.

9 టు 5 జాబ్‌కి గుడ్ బై

దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు తన నిజమైన ఆసక్తి ఏంటో దుల్కర్‌కు అర్థమైంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు చేసే రెగ్యులర్ ఆఫీస్ జాబ్ తనకు సెట్ కాదని రియలైజ్ అయ్యాడు. నెమ్మదిగా కెమెరా భయం నుంచి బయటపడి, ఖాళీ సమయంలో తన స్నేహితులతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాడు. ఈ అనుభవం అతనిలోని నటుడిని నిద్రలేపింది. జీవితంలో ఏం చేయాలనే క్లారిటీ వచ్చిన వెంటనే, దుబాయ్‌లో మంచి జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసి, నటనలో కెరీర్ ప్రారంభించేందుకు ముంబైకి పయనమయ్యాడు.

సినిమాల్లోకి ఎంట్రీ

ముంబైలో యాక్టింగ్ మెళుకువలు నేర్చుకున్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్, పదేళ్లకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఉస్తాద్ హోటల్, బెంగళూర్ డేస్, 'చార్లీ' లాంటి సూపర్ హిట్ సినిమాలతో యువతకు ఫేవరెట్ హీరో అయ్యాడు. ఇటీవలి కాలంలో 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' చిత్రాల భారీ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో మెరిశాడు. అభిమానులు ఇతన్ని ప్రేమగా డీక్యూ, కుంజిక్క, సాలు అని పిలుచుకుంటారు.

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన దుల్కర్.. 2025లో విడుదలై మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్‌గా, ఆల్ టైమ్ రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిన 'లోక: చాప్టర్ 1' సినిమాకు పెట్టుబడి పెట్టాడు.

అల్లు అర్జున్ ప్రశంసలు

దుల్కర్ సల్మాన్ తదుపరి చిత్రం 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20, 2026న బహుభాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ ఇన్స్పైరింగ్ స్టోరీలో సాత్వికా వీరవల్లి,శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

అంతరిక్ష విజ్ఞానం చదివి వ్యోమగామి కావాలని కలలు కనే ఓ యువతి స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ సినిమా అసలు కథ. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దుల్కర్ సల్మాన్ కథల ఎంపికను, సింప్లిసిటీని మెచ్చుకున్నాడు. 'ఆకాశంలో ఒక తార' సినిమా కథ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Odyssey OTT: ప్రపంచ సినీ లోకాన్ని మెస్మరైజ్ చేసిన మాస్టర్ పీస్.. ఓటీటీలోకి వచ్చేసిన ఒడిస్సీ
బండ్ల గణేశ్‌కు జైలు శిక్ష‌, రూ.95 లక్షల జరిమానా.. అస‌లేం జ‌రిగిందంటే.?