సమంతపై కీర్తి సురేష్ కి ఇలాంటి అభిప్రాయం ఉందా.. స్పందించిన సామ్..

Published : Apr 16, 2023, 06:10 PM IST
సమంతపై కీర్తి సురేష్ కి ఇలాంటి అభిప్రాయం ఉందా.. స్పందించిన సామ్..

సారాంశం

కీర్తి సురేష్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ అనేక అభిప్రాయాలు పంచుకుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. శకుంతల, దుశ్యంతుడు ప్రేమ కథగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో సమంత టైటిల్ రోల్ ప్లే చేసింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సర్వత్రా నెగిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నాయి. 

సమంత ఎమోషనల్ గా బాగానే నటించింది. కానీ కథనం టివి సీరియల్ సాగినట్లు, ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఇక మరోవైపు కీర్తి సురేష్ దసరా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నానికి జోడిగా కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటించింది. 

తాజాగా కీర్తి సురేష్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ అనేక అభిప్రాయాలు పంచుకుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఓ అభిమాని సమంత గురించి చెప్పమని అడగగా కీర్తి సురేష్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. 

సమంత ప్రేరణ కలిగించే వ్యక్తి. ఆమెకి గుండె ధైర్యం చాలా ఎక్కువ. ఒకరకంగా చెప్పాలంటే సమంత అన్ స్టాపబుల్ అని కీర్తి సురేష్ ప్రశంసలు కురిపించింది. దీనితో సమంత థాంక్యూ డియర్ అని రిప్లై ఇవ్వడం విశేషం. 

అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. కీర్తి సురేష్ ని నువ్వు అని సంబోధించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి కూడా కీర్తి సురేష్ స్పందించింది. మనకి ఇష్టమైన వ్యక్తులని మనం నువ్వు అనే పిలుస్తాం. అంత మాత్రాన అది గౌరవం లేకుండా పిలిచినట్లు కాదు అని కీర్తి సురేష్ బదులిచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్