'మహానటి'లో నటించడం నాకు ఇష్టం లేదు, రిజెక్ట్ చేద్దాం అనుకున్నా..వాళ్ళిద్దరికీ కోపం తెప్పించిన కీర్తి సురేష్

By tirumala AN  |  First Published Jan 3, 2025, 12:00 PM IST

కీర్తి సురేష్ కెరీర్ లో మహానటి బెస్ట్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు లభించింది.


కీర్తి సురేష్ కెరీర్ లో మహానటి బెస్ట్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు లభించింది. కీర్తి సురేష్ జీవితంలో అది మరచిపోలేని అనుభూతి. ఇంతటి గొప్ప అవకాశాన్ని కీర్తి సురేష్ వదులుకోవాలని భావించిందట. 

4 గంటలు కథ చెప్పిన నాగ్ అశ్విన్ 

రీసెంట్ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మహానటి చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సావిత్రి బయోపిక్ కథతో నాగ్ అశ్విన్ నా దగ్గరకి వచ్చారు. అతడితో ప్రియాంక, స్వప్న దత్ కూడా వచ్చారు. నాగ్ అశ్విన్ నాకు ఏకంగా 4 గంటల పాటు మహానటి కథ నేరేట్ చేశారు. అప్పుడే నాకు మహానటి చిత్రంపై నెగిటివ్ ఇంప్రెషన్ పడింది. 4 గంటలు నేరేట్ చేసే సరికి విసుగు వచ్చింది. ఇది వర్కౌట్ అవుతుందా అనే భయం మొదలయింది అని కీర్తి సురేష్ తెలిపింది. 

Latest Videos

సావిత్రి బయోపిక్.. తేడా జరిగితే అంతే.. 

అంతలా ఎందుకు భయపడ్డానంటే.. ఇది సావిత్రి గారి బయోపిక్. తేడా జరిగితే ట్రోలింగ్, విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. అనవసరంగా రిస్క్ చేయడం ఎందుకు అని అనుకున్నా. దీనికి తోడు నాగ్ అశ్విన్ నేరేట్ చేసిన విధానం కూడా నచ్చలేదు. దీనితో నా మనసులో మాట స్వప్న, ప్రియాంకకి చెప్పా. ఈ చిత్రంలో నటించలేనని తెలిపా. 

వాళ్ళు వెంటనే ఈ అమ్మాయికి పిచ్చా.. సావిత్రి అమ్మ బయోపిక్ ని రిజెక్ట్ చేస్తోంది ఏంటి.. ఇంత గొప్ప అవకాశం ఎవరికైనా వస్తుందా అని తిట్టారు. కానీ నాగ్ అశ్విన్ నాకు ధైర్యం చెప్పారు. కానీ భయపడుతూనే ఆ చిత్రానికి ఒకే చెప్పా అని కీర్తి సురేష్ తెలిపింది. సావిత్రి బయోపిక్ లో నటించే నటికి ఒక రేంజ్ ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. నా లాంటి అమ్మాయి నటించి, సినిమా బాగా రాకుంటే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. కానీ నాగ్ అశ్విన్ ఆ భయాన్ని పోగొట్టి నేను అంగీకారం తెలిపేలా చేశారు అని కీర్తి సురేష్ పేర్కొంది. 

కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు 

కట్ చేస్తే మహానటి చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత జాతీయ అవార్డు కూడా కీర్తి సురేష్ కి దక్కింది. ఒక వేళ కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసి ఉంటే.. ఆమె ఏమి కోల్పోయి ఉండేదో మాటల్లో చెప్పడం కష్టం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో నటించారు. సమంత, విజయ్ దేవరకొండ జర్నలిస్టులుగా నటించిన సంగతి తెలిసిందే. 

Also Read : శంకర్ ఫీల్ అయినా పర్వాలేదు, రాంచరణ్ గురించి రాజమౌళి చెప్పింది నిజమే

కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ 

డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలయింది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకుని కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది.    

పెళ్ళైన కొన్ని రోజులకే కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం వచ్చేసింది. అంత కష్టపడినప్పటికీ కీర్తి సురేష్ కి మంచి ఫలితం దక్కలేదు.    కీర్తి సురేష్ రీసెంట్ గా బేబీ జాన్ చిత్రంలో నటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరి చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు.  కానీ బేబీ జాన్ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వరుణ్ ధావన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తోంది. పెళ్ళయాక తొలి చిత్రమే డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ దారులు మూసుకుపోయినట్లే అని అంటున్నారు. 

Also Read : జస్ట్ 50 వేలతో మొదలు, వందల కోట్లకి పడగెత్తిన కమెడియన్ అలీ.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఆస్తులు

 

click me!