మహానటి బ్యూటీ మైదాన్ మొదలైయ్యింది!

Published : Aug 19, 2019, 03:38 PM IST
మహానటి బ్యూటీ మైదాన్ మొదలైయ్యింది!

సారాంశం

కోలీవుడ్ - టాలీవుడ్ ఇండస్ట్రీలలో బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. 

కోలీవుడ్ - టాలీవుడ్ ఇండస్ట్రీలలో బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. సౌత్ లో సక్సెస్ అయినట్టుగానే నార్త్ లో కూడా మంచి విజయాలు అందుకోవాలని ఈ మలయాళీ బ్యూటీ ఫిట్ నెస్ లో మార్పులు కూడా తెచ్చింది. 

గోల్డెన్ డేస్ ఫుట్ బాల్ (1952-62) బ్యాక్ డ్రాప్ లో అజయ్ దేవగన్ కొత్త చిత్రం తెరక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మైదాన్ అని టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ రోజే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సినిమాలో కీర్తి సురేష్ అజయ్ దేవ్ గన్ సతీమణిగా కనిపించబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కీర్తి ఆశపడుతోంది. 

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మొదట్లోనే సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?