తమ్ముడే అతిథి.. మెగాస్టార్ బర్త్ డే వేడుకలకు క్రేజీ ప్లాన్!

Published : Aug 19, 2019, 03:22 PM IST
తమ్ముడే అతిథి.. మెగాస్టార్ బర్త్ డే వేడుకలకు క్రేజీ ప్లాన్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏటా మెగా ఫ్యామిలీ చిరు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న శిల్పకళా వేదికలో భారీ చిరు బర్త్ డే సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.   

ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఇలా అందరూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలకు అభిమానులకు దూరంగా ఉంటారట. ఆయన తన సతీమణి సురేఖతో కలసి ఫారెన్ టూర్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆసక్తికర విషయం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ ఈవెంట్ కు హాజరైతే అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా హీరోలందరితో పవన్ ని ఓసారి చూడాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు