‘దసరా’ బ్లాక్ బాస్టర్.. కీర్తి సురేష్ ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి.. వీడియో..

By Asianet News  |  First Published Mar 31, 2023, 7:14 PM IST

నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దుమ్ములేపుతోంది. ఈ సక్సెస్ పై కీర్తి సురేష్ రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. 
 


’నేను లోకల్‘ తర్వాత  నేచురల్ స్టార్ నాని  - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’.  రా అండ్ రస్టిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో దుమ్ములేపుతోంది. నాని నట విశ్వరూపానికి ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా మాసీవ్ కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సకస్ పై ఇప్పటికే నాని ట్వీట్ చేశారు. తాజాగా కీర్తి సురేష్ కూడా స్పందించింది.

‘దసరా’ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో  కీర్తి సురేష్ (Keerth  Suresh)  చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. మహానటి తర్వాత మళ్లీ ఛాలెంజింగ్ రోల్ నటించి తన ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను కట్టిపడేసింది. డీగ్లామర్ రోల్ నూ తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తానికి Dasara బ్లాక్ బాస్టర్ హిట్ కీర్తి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్బంగా తన అభిమాన్ని అభిమానులతో ఇన్ స్టా ద్వారా పంచుకుంది. 

Latest Videos

దసరా సెట్స్ లో  కీర్తి సురేష్ గంతులేస్తూ కారు వద్దకు వెళ్లిన  ఓ వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది. ఈ వీడియోను చూపిస్తూ తను కూడా సంతోషంతో గంతులేస్తున్నట్టుగా తెలియజేసింది. దసరాపై అందరూ చూపించిన ప్రేమకు వెన్నెల చాలా సంతోషంగా గంతులు వేస్తుందని చెప్పుకొచ్చింది. కీర్తి సంతోషాన్ని చూసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘క్యూటీ’ అని కామెంట్ చేశారు. యంగ్ బ్యూటీ చాందిని చౌదరి కూడా కామెంట్ చేసింది. 

ప్రస్తుతం కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కీర్తి నటనకు అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. శ్రీరామ నవమి రోజున ప్రపం చ వ్యాప్తంగా విడుదలైంది.

 

click me!