మూగజీవాలతో కీర్తి సురేష్ ఫ్రెండ్షిప్, ఫోటో గ్రాఫర్ గా మారిన నేచురల్ స్టార్ నాని

Published : Mar 29, 2023, 12:15 PM ISTUpdated : Mar 29, 2023, 12:18 PM IST
మూగజీవాలతో కీర్తి సురేష్ ఫ్రెండ్షిప్, ఫోటో గ్రాఫర్ గా మారిన నేచురల్ స్టార్ నాని

సారాంశం

దసరా సినిమాలో డీ గ్లామర్ రోల్ చేస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్.. నానీతో  కలిసి.. పక్కా పల్లెటూరి అయ్మాయి పాత్రలో మెరుపులుమెరిపిస్తోంది.  ఈమూవీ షూటింగ్  కు సబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియా పంచుకుంది బ్యూటీ.  ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.   

నేచురల్ స్టార్ నానీని ఫోటో గ్రాఫర్ గా మార్చేసింది కీర్తి సురేష్. దసరా మూవీ సెట్స్ లో నానీతో కలిసి ఆడుతూ పాడుతూ.. షూటింగ్ కంప్లీట్ చేసిన బ్యూటీ.. ఆ సినిమా సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ను అప్పుడప్పుడు.. రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తూ వస్తోంది. ఆమధ్య దసరా సెట్స్ లో షటిల్ ఆడుకున్న వీడియోను శేర్ చేసింది కీర్తి సురేష్.. ఈ విడియోలు నానీని బెదిరిస్తూ గేమ్ నాదే అంటుంటే.. ఆడియన్స్ తెగ స్పందించారు. ఇక ఈసారి నానీని కెమెరామెన్ ను చేసేసింద కీర్తి. తనకు నచ్చిన ఫోటోస్.. వీడియోస్ ను నానీచేత రికార్డ్ చేయింది. 

తాజాగా కీర్తి దసరా సెట్‌లో గేదెలతో, మేకపిల్లతో, కోడితో  ఆడుకుంటూ.. ఎంజాయ్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. కీర్తికు మూగజీవాలంటే చాలా ఇష్టం.  వాటితో  ఏమాత్రం భయపడకుండా  చనువుగా ఉంటూ.. సరదాగా గడిపింది. అయితే ఈ వీడియోలను నానీ తీస్తున్నట్టుగా కనిపించింది. దాంతో ఈ వీడియోస్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దసరా సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.  నాని హీరోగా.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈసినిమాను శ్రీకాంత్‌ ఓదెల డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ రేపు (మార్చ్ 30) ప్రపంచ వ్యాప్తంగా 5భాషల్లో రిలీజ్ కాబోతోంది. 

 

ఇక  ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజ్ అయిన  టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. దసరాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుండటంతో.. పక్కాగా 100 కోట్లు వసూలు చేస్తుందని అంతా నమ్ముతున్నారు.  రిలీజ్ కు నెల రోజులు ముందునుంచే ప్రమోషన్స్ తో దూసుకుపోయారు మూవీ టీమ్. అటు బాలీవుడ్ లో కూడా వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ.. తెగ హడావిడి చేశారు. నేచురల్ స్టార్ నీని కూడా ఈసినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.

 

ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు.. నేచురల్ స్టార్ నాని కూడా ...  డీ గ్లామర్‌ రోల్ లో నటిస్తున్నారు.   పోస్టర్‌లలో కూడా కీర్తి అచ్చమైన తెలంగాణ ఆడపడుచులా కనిపనిస్తోంది. ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలలో కీర్తి వెన్నెల పాత్రలో నటించింది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా పాటలన్నీ ఇప్పటికే జనాలకు ఎక్కేశాయి.. ఇన్ స్టా రీల్స్ లో మారుమోగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు