'మహానటి'కి కోటిన్నర!

Published : May 07, 2018, 01:23 PM ISTUpdated : May 07, 2018, 03:47 PM IST
'మహానటి'కి కోటిన్నర!

సారాంశం

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోన్న ఈ నటికి ఏకంగా కోటిన్నర రూపాయలను రెమ్యునరేషన్ గా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం ముందుగా చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ ఫైనల్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు. మొదట కీర్తి కూడా ఈ పాత్రలో నటించడానికి భయపడింది. కానీ దర్శకనిర్మాతలు ఇచ్చిన ధైర్యంతో సినిమాలో నటించింది. ఈ సినిమా పోస్టర్లు చూసిన వారంతా సావిత్రి పాత్రకు కీర్తి యాప్ట్ అని అంటున్నారు. అంతగా ఆమె తన లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కోసం ఆమెకు ఎంత పారితోషికం దక్కిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోన్న ఈ నటికి ఏకంగా కోటిన్నర రూపాయలను రెమ్యునరేషన్ గా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. నిజంగా స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి తారలకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతోంది. కానీ కీర్తి సురేష్ కెరీర్ ఆరంభించిన కొత్తలోనే ఈ రేంజ్ లో పారితోషికం అందుకోవడం హాట్ టాపిక్ అయింది. కీర్తి కెరీర్ లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పాలి!

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్