నా వల్లే RRR కి ఆస్కార్ వచ్చింది.. అజయ్ దేవగన్ కామెంట్స్ తో అతడికి దిమ్మతిరిగింది, వైరల్ వీడియో

Published : Mar 25, 2023, 11:44 AM ISTUpdated : Mar 25, 2023, 11:49 AM IST
నా వల్లే RRR కి ఆస్కార్ వచ్చింది.. అజయ్ దేవగన్ కామెంట్స్ తో అతడికి దిమ్మతిరిగింది, వైరల్ వీడియో

సారాంశం

ఆస్కార్ గెలిచిన తర్వాత కూడా నాటు నాటు సాంగ్ ప్రస్తావన ఇంకా వస్తూనే ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 95వ అకాడమీ అవార్డ్స్ లో నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. 

ఆస్కార్ గెలిచిన తర్వాత కూడా నాటు నాటు సాంగ్ ప్రస్తావన ఇంకా వస్తూనే ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 95వ అకాడమీ అవార్డ్స్ లో నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అవార్డు గెలుచుకుని రాజమౌళి, కీరవాణి, రాంచరణ్,, ఎన్టీఆర్, ఇతర ఆర్ఆర్ఆర్ టీం ఇండియాకి తిరిగొచ్చేశారు కూడా. బాలీవుడ్ లో సైతం సెలెబ్రిటీలు ఇంకా ఈ పాట గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. 

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రామరాజు తండ్రిగా అజయ్ దేవగన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. త్వరలో అజయ్ దేవగన్ భోళా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భోళా చిత్రం కార్తీ ఖైదీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. లోకేష్ కనకరాజ్, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ సౌత్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అజయ్ దేవగన్ భోళా చిత్రాన్ని హిందీలో తీసుకువస్తున్నారు. 

మార్చి 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సీనియర్ నటి టబు కూడా ఈ మూవీలో కీలక పాత్రలో మెరిసింది. తాజాగా వీరిద్దరూ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చినందుకు అజయ్ దేవగన్ కి కపిల్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు. దీనితో అజయ్ స్పందిస్తూ నా వల్ల నాటు నాటుకి ఆస్కార్ వచ్చింది అని అజయ్ బదులిచ్చారు. ఆశ్చర్యపోవడం కపిల్ శర్మ వంతైంది. ఎందుకంటే అజయ్ దేవగన్ కి నాటు నాటు సాంగ్ తో ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి ఆయన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారు. అలాంటిది అజయ్ నావల్లే ఆస్కార్ వచ్చింది అని చెప్పడంతో.. కపిల్ శర్మ ఆశ్చర్యపోయారు. 

అది ఎలా అని కపిల్ శర్మ ఆసక్తిగా అడగగా.. ఒకసారి ఊహించుకో నాటు నాటు సాంగ్ కి నేను డ్యాన్స్ చేసుంటే పరిస్థితి ఏంటో అని అజయ్ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వేశారు. ఈ షోకి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు