కౌశల్ షాకింగ్ డెసిషన్.. ఫౌండేషన్ కి బ్రేకులు!

Published : Mar 05, 2019, 02:01 PM IST
కౌశల్ షాకింగ్ డెసిషన్.. ఫౌండేషన్ కి బ్రేకులు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ తన అభిమానులతో కలిసి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ప్లాన్. 

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ తన అభిమానులతో కలిసి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ప్లాన్.

అయితే ఈ ఫౌండేషన్ కి చెందిన డబ్బుని కౌశల్ దుర్వినియోగం చేస్తున్నాడని, తన స్వంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేశారు.

వాటిలో నిజం లేదని కౌశల్ చెబుతున్నప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో కౌశల్.. ఫౌండేషన్ ని తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫౌండేషన్ ని కొన్ని రోజుల పాటు నిలిపివేసి ఆ తరువాత ఫౌండేషన్ సభ్యులను వ్యక్తిగతంగా కలుసుకొని ఎంపిక చేస్తానని అన్నారు. ఇప్పటికి రాష్ట్రస్థాయి కమిటీలు, జాతీయ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం