స్టేజిపై నటి వెటకారం...కార్తికి కాలి గట్టిగానే కౌంటర్!

By Udaya DFirst Published Mar 5, 2019, 12:22 PM IST
Highlights

ఎవరినైనా కావాలని గిచ్చితే కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి పనే  సినీ నటి కస్తూరి చేసింది. ఆమె బిహేవియర్   పట్ల హీరో కార్తి కి చాలా కోపం వచ్చింది. ఆమె చేసిన పనికి తగ్గట్లుగానే కౌంటర్ ఇచ్చారు. 

ఎవరినైనా కావాలని గిచ్చితే కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి పనే  సినీ నటి కస్తూరి చేసింది. ఆమె బిహేవియర్   పట్ల హీరో కార్తి కి చాలా కోపం వచ్చింది. ఆమె చేసిన పనికి తగ్గట్లుగానే కౌంటర్ ఇచ్చారు. 

వివరాల్లోకి వెళితే.. నిన్న (సోమవారం) చెన్నైలో ‘జులై కాట్రిల్‌’ అనే తమిళ సినిమా ఆడియో లాంచ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకకు కస్తూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్తి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో కస్తూరి.. కార్తిని సెల్ఫీ కావాలని అడుగుతూ పరోక్షంగా ఆయన తండ్రి శివకుమార్‌ను టార్గెట్‌ చేసినట్లు మాట్లాడారు.. ‘మీ నాన్న లేరు కదా.. రండి ఓ సెల్ఫీ దిగుదాం’ అని కార్తితో వ్యంగ్యంగా అన్నారు.

ఇందుకు కార్తికి కోపం వచ్చింది. సెల్ఫీ దిగడానికి ఆయన ఒప్పుకోలేదు. నేరుగా స్టేజ్‌పై ఉన్న మైక్‌ స్టాండ్‌ వద్దకు వెళ్లి.. ‘అనుమతి లేకుండా ఓ సెలబ్రిటీతో సెల్ఫీలు దిగేస్తే ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలీదు. ఫోన్‌ నుంచి వెలువడే ఫ్లాష్‌లైట్‌ వల్ల మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి’ అని చెప్పి కార్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

గతంలో జరిగిన సంఘటన..

కొన్ని నెలల క్రితం శివకుమార్‌ ఓ కార్యక్రమానికి వెళుతుండగా అభిమానులు ఆయన చుట్టుముట్టేశారు. ఆ సమయంలో ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా శివకుమార్‌కు కోపం వచ్చి ఫోన్‌ను విసిరిపారేశారు. ఈ ఘటన కాస్తా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత శివకుమార్‌ తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడిస్తూ సదరు యువకుడికి సారీ చెప్పారు. అంతేకాదు కొత్త ఫోన్‌ను కూడా కొనిచ్చారు.

 

click me!