ప్రభాస్ ని చెంపదెబ్బ కొట్టిన అభిమాని.. వీడియో వైరల్!

Published : Mar 05, 2019, 01:43 PM IST
ప్రభాస్ ని చెంపదెబ్బ కొట్టిన అభిమాని.. వీడియో వైరల్!

సారాంశం

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో చెప్పనక్కర్లేదు. 

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ మరింత ఎక్కువయ్యారు. ఎంతగా అంటే ప్రభాస్ కనిపించిన వెంటనే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఓ అమ్మాయి అతడిని పట్టుకోవాలని బుగ్గపై చిన్నగా కొట్టింది.

వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగ్ కోసం విదేశాలను ప్రయాణాల్లో ఉండగా.. ఎయిర్ పోర్ట్ లో ఓ యంగ్ లేడీ ఫ్యాన్ అతడి వెంటపడింది. అతడితో ఫోటో దిగడానికి  ప్రయత్నించింది.

ప్రభాస్ కూడా కూల్ గా ఆమెతో ఫోటో దిగాడు. ప్రభాస్ ని చూసిన ఆనందం ఆ యువతి ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. ఆ ఎగ్జైట్మెంట్ ని దాచుకోలేకపోయింది. అక్కడే ఎగిరి గంతేస్తూ సడెన్ గా ప్రభాస్ బుగ్గపై ప్రేమగా చిన్న దెబ్బ కొట్టింది.

ప్రభాస్ సైతం ఆ యువతి టచ్ చేసిన చోట బుగ్గ నిమురుకుంటూ సింపుల్ గా నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే