కౌశల్ కి షాక్.. రివర్స్ అయిన కౌశల్ ఆర్మీ!

Published : Feb 26, 2019, 09:56 AM IST
కౌశల్ కి షాక్.. రివర్స్ అయిన కౌశల్ ఆర్మీ!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే అతడి కోసం ఒక ఆర్మీ కూడా తయారైంది. 

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే అతడి కోసం ఒక ఆర్మీ కూడా తయారైంది. ఈ ఆర్మీ కౌశల్ ని ఎవరైనా హౌస్ లో ఒక్క మాట అన్నా, గొడవ పడినా వాళ్లను ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోయేవారు కాదు. ఇక కౌశల్ యాంటీ ఫ్యాన్స్ మీద ట్రోలింగ్, కామెంట్లతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసేవారు.

అయితే ఇప్పుడు సడెన్ గా కౌశల్ ఆర్మీ.. కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ కి డబ్బు పిచ్చి అంటూ కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డబ్బు లేకపోతే ఫ్యాన్స్ ని కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా కౌశల్ ఆర్మీ ఖర్చు భరించాల్సి వచ్చేదని,  ఫ్యాన్స్ తమ డబ్బులతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారని అతడు చెప్పడం షాక్ కి గురి చేసింది.

బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుని ఫౌండేషన్ కి ఉపయోగిస్తానని చెప్పిన మాటల్లో కూడా నిజం లేదని అన్నారు. ఫౌండేషన్ కి ఫ్యాన్స్ ఇచ్చిన డబ్బుని కూడా దుర్వినియోగం చేశారని తెలిపారు. తనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సింపతీ క్రియేట్ చేస్తూ మానిప్యులేట్ చేస్తుంటాడని.. కౌశల్ లాంటి వ్యక్తి సొసైటీ కి చాలా డేంజర్ అని సంచలన కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కారణంగా 16 మంది ఏడుస్తుంటే ఏంటా  అనుకున్నామని కానీ ఇప్పుడు తెలుస్తోందని అన్నారు. ఫ్యాన్స్ అందరినీ బలిపశువులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?