
రణబీర్ కపూర్ తో కత్రినాకైఫ్ వీడిపోయిన మాట వాస్తవం. పరోక్షంగా ఈ విషయాన్ని రణబీర్ కూడా ధృవీకరించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో, అగ్రిమెంట్ ప్రకారం జగ్గా జాసూస్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇక వీళ్ల ప్రేమకథ కంచికి చేరినట్టేనని అంతా భావించారు. కానీ అంతలోనే షాకిచ్చింది కత్రిన.
వీకెండ్స్ లో షూట్స్ పెట్టుకోకుండా కాస్త ఫ్రీ గా ఉండే కత్రినాకైఫ్.. రణబీర్ కపూర్ తో కలిసి మిడ్ నైట్ డిన్నర్ కు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబయిలోని ఓ ఖరీదైన హోటల్ లో డిన్నర్ చేసిన ఈ జంట చాలా హ్యాపీగా కనిపించింది. విడిపోయాం అనే బాధ ఏ ఒక్కరిలో కనిపించలేదు.
వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారని కొందరు అనుకున్నారు. కానీ బాలీవుడ్ జనాలు చెబుతున్న ప్రకారం, ఇద్దరూ తమ బ్రేకప్ ను ఇలా సెలబ్రేట్ చేసుకున్నారట. ఇదే విషయంపై కొందరు కత్రినాను ఆరా తీస్తే, రణబీర్ తో కలిసి తిరిగితే తప్పేంటనే సమాధానం వచ్చిందట. అయినా విడిపోయినంత మాత్రాన కలిసి తిరగకూడదా అనేది కత్రిన ప్రశ్న.