సల్మాన్ కి కత్రినా పెళ్లి ప్రపోజల్!

By AN TeluguFirst Published 25, May 2019, 4:06 PM IST
Highlights

'పెళ్లి వయసు వచ్చింది కదా.. మరి ఎప్పుడు చెసుకుంటావ్' అని కత్రినా కైఫ్.. సల్మాన్ ఖాన్ ని అడుగుతోంది. 

'పెళ్లి వయసు వచ్చింది కదా.. మరి ఎప్పుడు చెసుకుంటావ్' అని కత్రినా కైఫ్.. సల్మాన్ ఖాన్ ని అడుగుతోంది. కానీ అది 'భరత్' సినిమా.. ఇదంతా నిజ జీవితంలో అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

సల్మాన్, కత్రినా జంటగా.. అలీ అబ్బాస్ జాఫర్ 'భరత్' సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ప్రపోజల్ వీడియో విడుదల చేశాడు. 

అందులో కత్రినా.. సల్మాన్ ఖాన్ కి పెళ్లి ప్రపోజల్ చేస్తుంది. 'పెళ్లి చేసుకునే వయసొచ్చింది' అని కత్రినా అడిగితే.. 'అవును' అని సమాధానమిస్తాడు సల్మాన్. 'నువ్ చూడడానికి చాలా బాగుంటావని' కత్రినా కంటే.. 'ధన్యవాదాలు' చెబుతాడు. 'నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావని' కత్రినా అడిగితే వెంటనే సల్మాన్ ఉలిక్కిపడుతూ జవాబు చెప్పకుండా కంగారు పడడం ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో సల్మాన్ వివిధ గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దిశా పటానీ కనిపించనుంది.

 

The proposal .... pic.twitter.com/1BCvPSirUe

— ali abbas zafar (@aliabbaszafar)
Last Updated 25, May 2019, 4:06 PM IST