పొలిటికల్ ఫైట్: అనుకున్నట్టుగానే KGF యష్ దెబ్బకొట్టాడు!

By Prashanth MFirst Published May 25, 2019, 3:33 PM IST
Highlights

ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది

ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది. KGF హీరో యష్ అనుకున్నట్టుగానే జాగ్వార్ హీరో నిఖిల్ గౌడని దెబ్బ కొట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నిఖిల్ పై పోటీకి దిగిన సుమలత బారి విజయాన్ని అందుకున్నారు. . అంబరీష్ భార్యగా కొంత సెంటిమెంట్ కలిసి వచ్చినప్పటికీ  ఆమె గెలవడానికి యష్ సపోర్ట్ కూడా ముఖ్య పాత్ర పోషించిందని చెప్పవచ్చు. నిఖిల్ గౌడ మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ సీటు కాంగ్రెస్ జేడీఎస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థికి రావాలి. ఆ సీటు కోసం సుమలత పోరాడారు. అయితే చివరి నిమిషాల్లో ఆమెకు చేదు అనుభవం ఎదురవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. అప్పుడే కన్నడ స్టార్  యష్ ఆమెకు అండగా నిలబడ్డాడు. 

 ఆ సమయంలో అధికార పార్టీ యష్ పై ఐటి దాడులు కావాలనే వేయించిందని టాక్ వచ్చింది. ఐటి దాడుల తరువాత యష్ బెదరకుండా సుమలత కోసం మరో అడుగు ముందుకు వేసి అభిమానులను ఆమె వైపుకు తిప్పాడు. ప్రత్యర్థి బలంగా ఉన్న స్థానాల్లో గ్యాప్ లేకుండా ప్రచారాలు నిర్వహించాడు. మొత్తానికి మాండ్యా ఎన్నికల్లో సుమలత లక్షకు పైగా ఓట్లు మెజార్టీతో నిఖిల్ గౌడపై గెలిచారు. ఈ ఎన్నికల ప్రచారాల్లో హీరోల మధ్య మాటల యుద్ధం కూడా పెరిగింది. కానీ యష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు నిఖిల్ సత్తా చాటలేకపోయాడు.     

click me!