కీర్తి సురేష్ పట్టించుకుంటే సమస్య పెద్దది అయ్యేది కాదు

By Surya PrakashFirst Published Dec 7, 2021, 9:12 AM IST
Highlights

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుహ్యా కారణాల వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‏ను ప్రకటించింది చిత్రయూనిట్. 

గత కొంతకాలంగా కోవిడ్ దెబ్బతో సినిమా మార్కెట్ డల్ గా ఉంది. ఉన్నంతలో ఓటిటి వచ్చి కొంత వరకూ సినిమాలని బ్రతికించింది. ఇప్పుడిప్పుడే సినిమాలు థియోటర్ లో రిలీజ్ అవుతూ డబ్బులు చేసుకుంటున్నాయి. ఈ వారం రిలీజైన `అఖండ`తో నిర్మాతలకు ధైర్యం వచ్చింది. అయినా సరే చిన్న సినిమాలు భాక్సాఫిస్ దగ్గర నిలబడటం కష్టంగా ఉంది. నిత్యామీనన్ ఎంతగానో ప్రమోట్ చేసి, నిర్మించిన స్కైలాబ్ ని పట్టించుకున్న వాళ్లు లేరు. ఈ క్రమంలో కీర్తి సురేష్ (Keerthy Suresh)సోలోగా నటించిన  'గుడ్ లక్ సఖి' (Good Luck Sakhi)రిలీజ్ కు రెడీ అయ్యి..వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సినిమాకు బజ్ రాకపోవటమే అందుకు కారణం అని చెప్పుకుంటున్నారు.

Keerthy Suresh నటించినా ఎందుకు బజ్ రావటం లేదు అంటే కేవలం ఆమె పట్టింకోకపోవటే అంటున్నారు. ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పుకుంటున్నారు. చిన్న సినిమాకు విపరీతమైన ప్రమోషన్ చేస్తే కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అలాంటిది సైలెంట్ గా ఉండి,సినిమాలో కంటెంట్ ఉంటే వాళ్లే నిలబెడతారు అనే ఆలోచన ఉంటే ఓపినింగ్స్ ఉండవని, బయ్యర్లు ముందుకు రావటం లేదంటున్నారు. కీర్తి సురేష్ సీన్ లోకి వస్తే బిజినెస్ పరంగా బాగా వర్కవుట్ అయ్యేదని చెప్పుకుంటున్నారు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుహ్యా కారణాల వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‏ను ప్రకటించింది చిత్రయూనిట్. గుడ్ లక్ సఖి సినిమాను డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. గుడ్ లక్ సఖి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కీర్తి సురేష్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

also read: EMK: పూరి జగన్నాధ్ స్టైల్ లో 'సర్కారు వారి పాట'.. మహేష్ భలే సంగతి చెప్పాడే

click me!