కత్తి మ‌హేష్ ఆరోగ్య‌ ప‌రిస్థితి ఏమిటి?

By Surya PrakashFirst Published Jun 28, 2021, 12:50 PM IST
Highlights

 సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు ఆపరేషన్ జరుగుతోంది. అందుకు సంభందించిన వివరాలు...

న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ు, సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయన స్నేహితులు,సన్నిహితులు ఆయన హెల్త్ కు సంభందించిన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయ‌న ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న క‌రంగానే ఉన్నా, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని  చెబుతున్నారు. అయితే ఈరోజు (సోమ‌వారం) మధ్యాహ్నం ఆయ‌న‌కు ఓ కీల‌క‌మైన ఆప‌రేష‌న్ చేయ‌బోతున్నారు.  Carniofacial reconstruction operation చేస్తున్నారని తెలిసింది. ముందు ఆ ఆపరేషన్ ద్వారా బోన్ స్ట్రక్చర్ reconstruct చేశాక కంటి ఆపరేషన్ చేస్తారు. కంటి చూపు సమస్య ఉండదనే నమ్మకంతో ఉన్నారు డాక్టర్స్. అయితే ఎడ‌మ కంటి చూపు పూర్తిగా పోయిన‌ట్టు వైద్యులు త‌మ‌కు చెప్పార‌ని క‌త్తి మేన‌మామ శ్రీ‌రాములు మీడియాకు స‌మాచారం ఇచ్చారు. త‌ల‌లో ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్రాణాపాయం త‌ప్పిన‌ట్టు వైద్యులు చెప్పార‌న్నారు.

 ఆపరేషన్ తర్వాత మనకి పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇప్పటికైతే కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైతే.. క‌త్తి మ‌హేష్ దాదాపుగా గ‌ట్టెక్కేసిన‌ట్టే. ప్ర‌మాదంలో ఆయ‌న మొహంపై తీవ్రమైన గాయాల‌య్యాయి. ద‌వ‌డ ఎముక చిట్లింది. క‌న్ను దెబ్బ‌తింది. నుదురు భాగంపైనా గ‌ట్టి దెబ్బే త‌గిలిందని సమాచారం.  

డాక్టర్లు.. కత్తి మహేశ్‌ గాయాలను పరీక్షించి... తలకు బలమైన గాయాలైనట్లు గుర్తించారు. ముక్కులో ఒక ఫ్యాక్చర్‌, కంటిలోపల మరో గాయమైందని వైద్యులు తెలిపారు. తలకు తగిలిన గాయాలకు ఈ రోజు ఆపరేషన్ చేస్తున్నారని, కంటికి కూడా ఆపరేషన్‌ చేస్తారని సన్నిహితులు తెలిపారు. కంటి చూపునకు ఎలాంటి సమస్య ఉండదని, వైద్యులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వివరించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.  ఆపరేషన్‌ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

 క‌త్తిమ‌హేష్ సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్లే గాయాల పాల‌య్యార‌ని, సీటు బెల్ట్ పెట్టుకుంటే ఆయ‌న ఇంత రిస్క్‌లో ప‌డేవారు కాద‌ని తెలుస్తోంది. చికిత్స నిమిత్తం... చాలా డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయ‌ని, అయితే క‌త్తి మ‌హేష్ కి అన్ని విధాలా సహాయం చేయ‌డానికి ఆయ‌న స్నేహితులు సిద్ధంగా ఉన్నార‌ని, ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బంలేవీ ప్ర‌స్తుతానికి లేవ‌ని స‌న్నిహితులు తెలుపుతున్నారు. మ‌హేష్ త్వ‌రగా కోలుకోవాల‌ని, ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.
 

click me!