ఆర్‌ నారాయణ మూర్తి అరెస్ట్‌

Surya Prakash   | Asianet News
Published : Jun 28, 2021, 12:19 PM IST
ఆర్‌ నారాయణ మూర్తి అరెస్ట్‌

సారాంశం

 అరెస్ట్ అయిన వారిలో నటుడు ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతమాత్రం ప్రయోజనకరంగా లేవని అన్నారు.

ప్రముఖ నటుడు.. ఉద్యమ సినిమాల హీరో ఆర్ నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్‌ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం జరిగింది. ఆ ర్యాలీలో ఆర్‌ నారాయణ మూర్తి పాల్గొన్నారు. 

రాజ్ భవన్‌ కు వెళ్లేందుకు అనుమతి లేదు అంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని తిరిగి వెళ్లి పోమనగా వారు నిరాకరించడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో నారాయణ మూర్తి కూడా ఉన్నారు.

ఈ సమయంలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ... కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు ఏమాత్రం రైతు ప్రయోజనకారి కాదు. 2006 సంవత్సరంలో బీహార్‌ లో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారు. ఆ చట్టం కారణంగా అక్కడ రైతులే లేకుండా పోయారు. అంతా రైతు కూలీలుగా మిగిలి పోయారు. అందుకే కేంద్రం ఆ మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. వ్యవసాయం, విద్యా, వైధ్యం ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఆయన పేర్కొన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్