చైనా అధ్యక్షుడితో 'మా' ఎలక్షన్స్ గురించి చర్చించిన నటుడు బ్రహ్మాజీ...!

Published : Jun 28, 2021, 12:26 PM IST
చైనా అధ్యక్షుడితో 'మా' ఎలక్షన్స్ గురించి చర్చించిన నటుడు బ్రహ్మాజీ...!

సారాంశం

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల హీటు మొదలైంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే జీవిత రాజశేఖర్,  నటి హేమా బరిలో దిగనున్నట్లు సమాచారం అందుతుంది.


నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా పోస్ట్స్ ఒకింత ఆసక్తి రేపుతూ ఉంటాయి. ఈ మధ్య ఆయనకు కోట్ల లాటరీ తగిలినట్లు ఫేక్ మెస్సేజ్ రావడంతో.. ఆ మెస్సేజ్ సైబర్ పోలీసులకు ఫార్వర్డ్ చేయడంతో పాటు డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని సెటైరికల్  ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ కావడం జరిగింది. అలాంటి ఫేక్ మెసేజెస్ కి స్పందించకూడని తనదైన స్టైల్ లో బ్రహ్మజీ తెలియజేశాడు. 


తాజాగా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల హీటు మొదలైంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే జీవిత రాజశేఖర్,  నటి హేమా బరిలో దిగనున్నట్లు సమాచారం అందుతుంది. రాజకీయ ఎన్నికల వేడిన తలపిస్తున్న 'మా' అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో నటుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. 


టాలీవుడ్ లో ఏర్పడిన యుద్ధ వాతావరణంపై బ్రహ్మాజీ సెటైర్ వేశారు. తాను చైనా అధ్యక్షుడిని కలిసినట్లు రాజకీయాల గురించి కాకుండా, 'మా' అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడినట్లు తెలియజేశారు. అలాగే చైనా అధ్యక్షుడు కొన్ని సూచనలు ఇచ్చినట్లు కామెంట్ చేశారు. జిన్ పింగ్ ని కలిసినట్లు ఉన్న మార్ఫింగ్ ఫోటో పంచుకున్న బ్రహ్మాజీ మా అధ్యక్ష ఎన్నికలపై ఈ విధంగా సెటైర్ వేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు