కథలో రాజకుమారి" సెన్సార్ పూర్తి, ఆగష్టు 25 విడుదల

Published : Jul 26, 2017, 08:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కథలో రాజకుమారి" సెన్సార్ పూర్తి, ఆగష్టు 25 విడుదల

సారాంశం

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం "కధలో రాజకుమారి ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సెన్సార్ సభ్యుల నుండి కథలో రాజకుమారికి పాజిటివ్ స్పందన  

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం "కధలో రాజకుమారి". రాజేష్ వర్మ సిరువూరి సమర్పణ లో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్, నిర్మాతలు 

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ "యు" సర్టిఫికేట్ అందుకొంది. సెన్సార్ సభ్యుల నుండి విశేష స్పందనను పొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన "కథలో రాజకుమారి"ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి" అన్నారు.

నాగశౌర్య, నమిత ప్రమోద్, నందిత, శ్రీముఖి, శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, అజయ్, ప్రభాస్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, కమెడియన్ సత్య, జెన్ని హని తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా- విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: నరేష్ కే రానా, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్!

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే