ఇక రానున్నది కాటమరాయుడు బాధితుల నిరాహార దీక్షలేనా..

First Published Mar 25, 2017, 12:05 PM IST
Highlights
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు
  • హైప్ క్రియేట్ చేసినంతగా కనిపించని కాటమరాయుడు
  • ఓపెనింగ్స్ అదరగొట్టిన కాటమరాయుడు ఫైనల్ కలెక్షన్స్ పై భయం
  • సేఫ్ సైడ్ లో నిర్మాత, టెన్షన్ పడుతున్న బయ్యర్లు

ఇబ్పబంవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా రిలీజై భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించిన కాటమరాయుడు రానున్న రోజుల్లో ఇదే ఊపు కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. అయితే ఓపెనింగ్స్ లోనే పెట్టుబడి పెట్టిన డబ్బంతా నిర్మాతకు రికవర్ అయ్యింది. అయితే బయ్యర్లు మాత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా... వీకెండ్ తర్వాత వచ్చే వీక్ డేస్ కలెక్షన్స్ జోరు ఇదే ఊపుతో కొనసాగాల్సిన అవసరం ఉంది.

 

గతంలో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో నష్టపోయిన బయ్యర్లకు 'కాటమరాయుడు' సినిమా ద్వారా సహకరిస్తామన్నారు. అయితే సర్దార్‌తో నష్టపోయిన వారిలో అందరికీ న్యాయం జరగలేదని కొందరు పంపిణీ దారుల 'నిరాహారదీక్ష'లని బట్టి అర్థమవుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయి, ఈ సినిమా కొనలేని పరిస్థితుల్లో వున్నవారికి రైట్స్‌ ఇవ్వలేదట. 'సర్దార్‌'తో నష్టపోయిన కొందరికి మాత్రం 'కాటమరాయుడు' రైట్స్‌ దక్కాయి.

 

అయితే కాటమరాయుడు చిత్రానికి ఓపెనింగ్‌ భారీగా వచ్చినా ... ఇదే ఊపు కొనసాగకుంటే రికవరీ కష్టమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే చివరకి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 'కాటమరాయుడు' బయ్యర్లకు అదే జరిగితే మాత్రం మరింత మంది బాధితులుగా మారటం ఖాయం. మరి  బాధితుల కోసం మరో సినిమా చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

నిజానికి బయ్యర్లకి  ఇబ్బందులు రాకూడదనే కాటమరాయుడు చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో ప్లాన్‌ చేసారు. టెక్నీషియన్లలో ఎవరినీ అంతగా పేరున్న వాళ్లని తీసుకోలేదు. పవన్‌ తర్వాత శృతిహాసన్‌కి తప్ప వేరెవరికీ పెద్దగా పారితోషికం కూడా ముట్టిందో లేదో ననేది అనుమానమే. అంత తక్కువ ఖర్చులో సినిమాను చుట్టేసినప్పటికీ సినిమా రైట్స్‌ మాత్రం భారీ స్థాయిలోనే అమ్మారు. పవన్‌ రెగ్యులర్‌ సినిమాల మాదిరిగానే కాటమరాయుడుకు ఎనభై అయిదు కోట్లు రాబట్టారు.

 

బిజినెస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత అన్ని అంశాల్లో తెలివిగానే వ్యవహరించారు. మరి ఈ చిత్రాన్ని సర్దార్‌తో నష్టపోయిన వారికి చేశామనడం కాస్త అర్థంకాని విషయమే. సర్దార్‌కి లాభాలే తప్ప నష్టం రాని నిర్మాత మళ్లీ ఈ సినిమాతోను లాభాల పంట పండించుకున్నాడు. మరి రేపు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే బయ్యర్ల మాటేమిటో?

click me!