
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలు పవన్ మానియాలో కొట్టుకుపోతున్నాయి. అయితే పవన్ మాత్రం తన కూతురుతో సరదాగా ఆడుకుంటున్నట్టు తెలుస్తుంది. పవన్, రేణు దేశాయిల కూతురు ఆద్య మార్చి 23న జన్మించింది.
నిన్న ఆద్యా తన ఏడో బర్త్ డే వేడుకలని పూణేలో జరుపుకోగా ఆ సెలబ్రేషన్స్ కి పవన్ కూడా హాజరు అయ్యాడట. ఆద్యా తో పాటు ఈ చిన్నారి ఫ్రెండ్స్ తోను పవన్ సరదాగా గడిపాడట. ఆద్యాతో పవన్ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రేణూ దేశాయ్ కూడా ఉంది. ఈ ఫోటోస్ ని చూసి పవన్ ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. ఒకవైపు కాటమరాయుడు చిత్ర సక్సెస్ తో ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటగా, ఆద్యా బర్త్ డే పిక్స్ ని చూసిన అభిమానుల సంతోషం కట్టలు తెంచుకుంటుంది. పవన్ గతంలోను పలు సార్లు పూణే వెళ్లి తన పిల్లలతో సరదాగా గడిపిన సంగతి తెలిసిందే.