సుకుమార్‌ రైటింగ్స్ లో కార్తికేయ సినిమా.. హిట్‌ బుక్‌ చేసుకున్నట్టే!

Published : Mar 12, 2021, 02:00 PM IST
సుకుమార్‌ రైటింగ్స్ లో కార్తికేయ సినిమా.. హిట్‌ బుక్‌ చేసుకున్నట్టే!

సారాంశం

సుకుమార్‌ తన `సుకుమార్‌ రైటింగ్స్`లో రూపొందించిన `కుమార్‌ 21ఎఫ్‌`, `ఉప్పెన` చిత్రాలు ఎంతటి సంచలనాలను క్రియేట్‌ చేశాయో తెలిసిందే. తాజాగా మరో సినిమాని ప్రకటించారు సుకుమార్‌. కార్తికేయతో, తన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్లతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. 

సుకుమార్‌ రైటింగ్స్ లో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని చెప్పొచ్చు. అద్భుతమైన కథలనే ఆయన తన బ్యానర్‌పై తెరకెక్కిస్తారు. తాను తీయలేకపోయిన చిత్రాలను తనఅసిస్టెంట్స్ తో తీయించి సక్సెస్‌ కొట్టడం ఆయన స్టయిల్‌. `కుమార్‌ 21ఎఫ్‌`, `ఉప్పెన` చిత్రాలు ఎంతటి సంచలనాలను క్రియేట్‌ చేశాయో తెలిసిందే. తాజాగా మరో సినిమాని ప్రకటించారు సుకుమార్‌. తన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్లతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. 

ఇందులో `ఆర్‌ఎక్స్ 100` హీరో కార్తికేయ హీరోగా నటించబోతుండటం విశేషం. దీంతో కచ్చితంగా కార్తికేయలో మరో హిట్‌ పడినట్టే అని అంటున్నారు. ప్రస్తుతం కార్తికేయ `చావు కబురుచల్లగా` చిత్రంలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో కార్తికేయ నటనని చూసిన సుకుమార్‌ తన బ్యానర్‌లో, తన కథతో సినిమానే తీసేందుకు ముందుకు వచ్చారు. మరి దీనికి దర్శకత్వం  ఎవరు వహిస్తారు, మెయిన్‌ ప్రొడ్యూసర్‌ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇది నవంబర్‌లో ప్రారంభం కానుందట. కార్తికేయ నటిస్తున్న `చావు కబురు చల్లగా` చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ గెస్ట్ గా పాల్గొని సినిమాపై అంచనాలను భారీగా పెంచారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Ramayana Trailer: 4000 కోట్ల 'రామాయణ' ట్రైలర్.. ఎక్కడ రిలీజో తెలుసా? ప్లాన్ ఇదే!