ఇటీవల కాలంలో నేనింతగా నవ్వలేదు..`జాతి రత్నాలు`కి అల్లు అర్జున్‌ ప్రశంసలు..

Published : Mar 12, 2021, 10:50 AM IST
ఇటీవల కాలంలో నేనింతగా నవ్వలేదు..`జాతి రత్నాలు`కి అల్లు అర్జున్‌ ప్రశంసలు..

సారాంశం

`జాతిరత్నాలు` చిత్రంపై స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. సినిమా హిలేరియస్‌గా నవ్వించిందన్నారు. రాత్రి ఆయన సినిమాని చూశానని, అద్భుతమైన కామెడీ చిత్రమన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.

సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతున్న `జాతిరత్నాలు` చిత్రానికి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. సినిమా హిలేరియస్‌గా నవ్వించిందన్నారు. రాత్రి ఆయన సినిమాని చూశానని, అద్భుతమైన కామెడీ చిత్రమన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు. `లాస్ట్ నైట్‌ `జాతిరత్నాలు` సినిమా చూశా. టీమ్‌ అందరికి నా అభినందనలు. హిలేరియస్‌ చిత్రమిది. ఇటీవల కాలంలో నేను ఇంతగా ఎప్పుడూ నవ్వలేదన్నారు. 

`నవీన్‌ పొలిశెట్టి స్టెల్లర్‌ పర్‌ఫెర్మెన్స్  చూపించారు. కొత్తరకమైన నటనని ప్రదర్శించారు. రాహుల్‌ రామకృష్ణ ఏమాత్రం ఎఫర్ట్ లేకుండా బ్రిలియంట్‌గా నటించారు. ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా బాగా చేశారు. రథన్‌ సంగీతం అద్భుతం. ఇతర టెక్నీషియన్లు కూడా బాగాచేశారు. ఈ చిత్ర నిర్మాతలు నాగ్‌ అశ్విన్‌, స్వప్న, ప్రియాంక దత్‌, అశ్వినీదత్‌లకు అభినందనలు. ఈ సినిమాని నమ్మినందుకు. ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్‌ చేసిన చిత్ర దర్శకుడు అనుదీప్‌పై గౌరవం పెరిగింది. ప్రతి ఒక్కరు బ్రెయిన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి సినిమాని, ఫన్‌ని ఎంజాయ్‌ చేయండి` అని పేర్కొన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?