రియా చక్రవర్తికి మరో షాక్‌..అమితాబ్‌ చిత్రంలో కనుమరుగు

Published : Mar 12, 2021, 10:32 AM IST
రియా చక్రవర్తికి మరో షాక్‌..అమితాబ్‌ చిత్రంలో కనుమరుగు

సారాంశం

సుశాంత్‌ మరణం కేసులో ఉక్కిరిబిక్కిరైన రియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్లీ కెరీర్‌ని పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `చెహ్రే` చిత్రంలో ఆమెని చూపించకపోవడం విచారకరం.

గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తికి మరో షాక్‌ తగిలింది. సుశాంత్‌ మరణం కేసులో ఉక్కిరిబిక్కిరైన రియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్లీ కెరీర్‌ని పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `చెహ్రే` చిత్రంలో ఆమెని చూపించకపోవడం విచారకరం. అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రియా చక్రవర్తి నటిస్తుంది. రమీ జెఫ్రీ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో రియా చక్రవర్తిని చూపించలేదు. కేవలం అమితాబ్‌, ఇమ్రాన్‌ హష్మీల లుక్స్ మాత్రమే చూపించారు. అన్సూ కపూర్‌ వాయిస్‌తో టీజర్‌ సాగింది. ఈ టీజర్‌ని ఇమ్రాన్‌ హష్మీ ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ, `ఆటని ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికే ఆట కోర్ట్ లో స్టార్ట్ అయ్యింది. టీజర్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 9న `చెహ్రే` చిత్రాన్ని థియేటర్‌లో చూడండి` అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన యాష్‌ ట్యాగ్‌లో కూడా రియా పేరుని పేర్కొనలేదు ఇమ్రాన్‌ హష్మీ. 

ఇదిలా ఉంటే ఈ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. టీజర్‌లో తనని చూపించకపోవడంతో రియా తీవ్రంగా బాధపడుతుందట. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లోనూ తన ఫోటోని వేయలేదు. ఇప్పుడు టీజర్‌నూ తనని పక్కన పెట్టేశారు. ఇంతకి సినిమాలో ఉంటుందా? లేదా? అనే ఆందోళనలో ఉన్నారట. అసలే సుశాంత్‌ కేసులో పూర్తిగా నలిగిపోయిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, ఇప్పుడు `చెహ్రే` రూపంలో దెబ్బపడినట్టయ్యింది. 
 
మరోవైపు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రియా సెకండ్‌ ఇన్నింగ్స్ ని బాలీవుడ్‌ ఒప్పుకోవడం లేదేమో అని, రియాని కావాలని కొందరు తొక్కేయాలని చూస్తున్నారని, ఈ యుద్ధంలో ఆమె కచ్చితంగా తెలుస్తుంద`ని అంటున్నారు. మరోవైపు పండితులు రియా మళ్లీ విజయవంతంగా కెరీర్‌ని సాగిస్తుందని చెబుతున్నారు. రియా సన్నిహితులు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు