టైమ్ ట్రావెల్ కథతో మహేష్ బాబు సినిమా.. సూపర్ స్టార్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట, నిజమెంతా..?

By Mahesh JujjuriFirst Published Jun 28, 2022, 1:17 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకూ చేయని కొత్త పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటి వరకూ తన కెరీర్ లో  వినని కథ విన్నాడు..? టైమ్ ట్రావెల్ బ్యాగ్రౌండ్ తో సినిమా చేస్తున్నాడట. మరి అందులో నిజమెంత..? 
 

త్రివిక్రమ్ మహేశ్ బాబుతో  సినిమా చేయనున్నాడు. అందుకోసం పూర్తిగా రెడీ అవుతున్నాడు. ఎప్పుడో ఓపెనింగ్ చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.  హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అనుకున్న దానికంటే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. 

ఇదిగో ఇప్పుడు అప్పుడు అంటూ.. ఈమూవీ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. అందుకు కారణం ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడమేనని అంటున్నారు. మరో వైపు మహేష్ బాబు మొన్నటి వరకూ సర్కారువారి పాట సినిమా బిజీలో ఉన్నాడు. అది అయిపోగానే ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లాడు.. ఇలా చాలా కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా డిలై అవుతూ వస్తోంది.  ఇక ఈ సినిమా నుంచి మరో క్రేజీ విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కెర్లు కొడుతుంది. 

ఇక ఈ  సినిమా కథ చారిత్రక నేపథ్యంలో సాగుతుందనీ, మహేష్  బాబు ఈ సినిమాలో డ్యూయోల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. . ఈ రెండు పాత్రలను డిజైన్ చేయడానికి త్రివిక్రమ్ ఎక్కువ సమయాన్ని తీసుకోవడం కూడా ఆలస్యానికి మరో కారణమని చెబుతున్నారు. ఇక మరో ఇంపార్టెంట్ విషయం ఏంటీ అంటే.. ఈ మూవీ టైమ్ ట్రావెల్ బ్యాక్ గ్రైండ్ తో నడుస్తుందంటున్నారు. ఇంత వరకూ మహేశ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని అనుకుంటున్నారు. 
 
తెరపై ఈ కథ నడిచే తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుందనీ, అటు గతం .. ఇటు వర్తమానం కలిసి నడిచేలా త్రివిక్రమ్ చేసిన స్క్రీన్ ప్లే గొప్పగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఒక హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. మరో కథానాయికగా ఎవరికి ఛాన్స్ తగులుతుందనేది చూడాలి. ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమాలో  జాయిన్ అవ్వబోతున్నాడు. 
 

click me!