నాని అయినా అతడికి లైఫ్ ఇస్తాడా..?

Published : Aug 06, 2019, 02:21 PM IST
నాని అయినా అతడికి లైఫ్ ఇస్తాడా..?

సారాంశం

సరైన కథలను ఎన్నుకోవడంలో తప్పులు చేయడంతో కార్తికేయ కెరీర్ పై పెద్ద ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం అతడి ఆశలన్నీ 'గ్యాంగ్ లీడర్' సినిమాపైనే ఉన్నాయి. నాని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాని విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

'RX 100' చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ ని అందుకున్న కార్తికేయ ఆ తరువాత 'హిప్పీ' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నటించే సమయంలో, ప్రమోషన్స్ లో సినిమా గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడేవాడు. కానీ తీరా రిజల్ట్ చూస్తే.. బయ్యర్లకు కనీసపు వసూళ్లు కూడా రాలేదు. 

రీసెంట్ గా అతడు నటించిన 'గుణ 369' సినిమా రిలీజైంది. మాస్ సినిమా కావడంతో 'హిప్పీ' కంటే మంచి వసూళ్లు వస్తాయని భావించారు. కానీ ఇది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ క్రేజ్ ని రెండు సినిమాల ఫ్లాప్ టాక్ తో పోగొట్టుకున్నాడు.

సరైన కథలను ఎన్నుకోవడంలో తప్పులు చేయడంతో కార్తికేయ కెరీర్ పై పెద్ద ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం అతడి ఆశలన్నీ 'గ్యాంగ్ లీడర్' సినిమాపైనే ఉన్నాయి. నాని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాని విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా కార్తికేయ కనిపించనున్నారు. నిజానికి విలన్ పాత్రకు అంగీకరించి కార్తికేయ మంచి నిర్ణయమే తీసుకున్నారు.

'RX 100'తర్వాత కాబట్టి ఈ ఛాన్స్‌ వచ్చింది కానీ అదే ఇప్పుడయితే ఇంత పెద్ద సినిమాలో ఇంత మంచి అవకాశం వచ్చేది కాదు. టాలీవుడ్ లో గోపీచంద్ లాంటి హీరోలు విలన్ గా నటించి ఆ తరువాత మాస్ హీరోగా మారి విజయాలు సాధించారు. మరి కార్తికేయ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా చాటతాడేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా