ఒకవైపు తండ్రి సెంటిమెంట్, మరోవైపు క్రైమ్.. ఆసక్తికరంగా కార్తికేయ 'భజే వాయువేగం' టీజర్

By tirumala ANFirst Published Apr 20, 2024, 6:13 PM IST
Highlights

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం భజే వాయు వేగం'. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. 

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం భజే వాయు వేగం'. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. 

హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయింది. ఒక వైపు తండ్రి సెంటిమెంట్, మరోవైపు క్రైమ్ ఇలా రెండు షేడ్స్ ఉన్న ఆకథలా టీజర్ ఆకట్టుకుంది. 'డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు.. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అంటూ.. కార్తికేయ పాత్రకి హైప్ ఇచ్చారు. 

 

మరోవైపు కార్తికేయ.. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు.. వాడికోసం ఏం చేయడానికైనా వెనుకాడం.. నా లైఫ్ లో అది మా నాన్న ' అంటూ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇంతకీ కార్తికేయ తండ్రికి.. అతడు చేస్తున్న క్రైమ్ కి ఏంటి సంబంధం అనేది ఈ చిత్రంలో అసలు పాయింట్ లాగా టీజర్ కట్ చేశారు. 

వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ వేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో అయినా మంచి విజయం దక్కించుకోవాలని కార్తికేయ ప్రయత్నిస్తున్నాడు. 

 

click me!